భారత సంతతి వనితకు కీలక పదవి.. OMD ఇండియా సీఈఓగా అనీషా అయ్యర్

|

Dec 14, 2021 | 2:08 PM

OMD India:  ఒమ్ని కామ్‌ మీడియా గ్రూప్‌ (OMD) ఇండియా సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన అనిషా అయ్యార్‌ను నియామకం అయ్యారు. అయ్యర్‌కు..

భారత సంతతి వనితకు కీలక పదవి.. OMD ఇండియా సీఈఓగా అనీషా అయ్యర్
Follow us on

OMD India:  ఒమ్ని కామ్‌ మీడియా గ్రూప్‌ (OMD) ఇండియా సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన అనిషా అయ్యార్‌ను నియామకం అయ్యారు. అయ్యర్‌కు డిజిటల్‌, టెక్నాలజీతో పాటు వ్యాపారంలో దాదాపు 18 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె 2019లో మలేషియాకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా గ్రూప్‌కు అనుసంధానంగా ఉన్న ఒమ్ని కామ్‌ మీడియాలో చేరారు. అయ్యర్ అప్పటి నుండి ఓమ్నికామ్ మీడియా గ్రూప్‌లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దాని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా థాయిలాండ్‌లో ఉన్నారు. అనిషా అయ్యార్‌ గతంలో మైండ్‌షేర్, మ్యాడ్‌హౌస్ మరియు గ్రూప్ కామ్ వంటి కంపెనీలలో ఆమె పనిచేశారు. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఆటో, ట్రావెల్, టెలికాం, ఇ-కామర్స్, ఆహారం అలాగే రిటైల్ వ్యాపారాలలో ఆమె తన నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకుంది.

అయితే OMD ఇండియా అనేది అంతర్జాతీయ మీడియా నెట్‌వర్క్‌ యొక్క భారతీయ విభాగం. ఒమ్నికామ్‌ మీడియా గ్రూప్‌ అనేది ఒమ్నికామ్‌ యొక్క మీడియా సేవల విభాగం. మీడియా గ్రూప్‌లో ఓఎండీ, హార్ట్‌ అండ్‌ సైన్స్‌, పీహెచ్‌డీ వంటి మీడియా ఏజెన్సీలు ఉన్నాయి. మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫారమ్ స్టాటిస్టా ప్రకారం.. 2020లో భారతీయ ప్రకటనల పరిశ్రమ విలువ రూ. 564 బిలియన్లకు పైగా ఉంది. అలాగే 2022 నాటికి రూ. 700 బిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది.

ఇవి కూడా చదవండి:

Satya Nadella: 2021లోనూ సత్తా చాటిన సత్య నాదెళ్ల.. వీడియో విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ బాస్..

Gautam Raghavan: ప్రవాసభారతీయుడికి వైట్ హౌస్‎లో కీలక పదవి.. వైట్ హౌస్ PPOగా నియమితులైన గౌతమ్ రాఘవన్..