Chennupati Jagadish: అస్ట్రేలియాలో తెలుగువ్యక్తికి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియన్​సైన్స్ అకాడమీ అధ్యక్షుడిగా చెన్నుపాటి

|

Dec 15, 2021 | 11:39 AM

భారత సంతతికి వ్యక్తికి అస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. తెలుగువాడైన చెన్నుపాటి జగదీశ్​.. ఆస్ట్రేలియన్​ అకాడమీ ఆఫ్​ సైన్స్(ANU) అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

Chennupati Jagadish: అస్ట్రేలియాలో తెలుగువ్యక్తికి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియన్​సైన్స్ అకాడమీ అధ్యక్షుడిగా చెన్నుపాటి
Australian Academy Of Science Chennupati Jagadish
Follow us on

Indian-origin professor Chennupati Jagadish: భారత సంతతికి వ్యక్తికి అస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. తెలుగువాడైన చెన్నుపాటి జగదీశ్​.. ఆస్ట్రేలియన్​ అకాడమీ ఆఫ్​ సైన్స్(ANU) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే కావడం విశేషం. ప్రముఖ నానోటెక్నాలజీ, ఫిజిక్స్ పరిశోధకుడు , ప్రముఖ ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీష్ , ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈమేరకు విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన మొదటి ఆస్ట్రేలియన్‌గా ఆయన రికార్డు సృష్టించారు. వచ్చే ఏడాది మే నెలలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆ దేశంలోని ప్రముఖ సైన్స్ సంస్థలలో ఒకటి, ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌తో పాటు ప్రజలకు స్వతంత్రంగా అధికారిక శాస్త్రీయ సలహాలను అందిస్తుంది. ఏఎన్‌యూ వైస్‌ఛాన్సలర్‌, నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ బ్రియాన్‌ స్మిత్‌ మాట్లాడుతూ.. సైన్స్‌ అకాడమీకి నాయకత్వం వహించేందుకు ప్రొఫెసర్‌ జగదీష్‌ సరైన వ్యక్తి అన్నారు. “జగదీష్‌ చేతుల్లో ఆస్ట్రేలియన్ సైన్స్, శాస్త్రీయ పరిశోధనలు చాలా సురక్షితమైన, స్ఫూర్తిదాయకమం” అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన చెన్నుపాటి జగదీశ్, 31 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో వెళ్లి స్థిరపడ్డారు. కృష్ణా జిల్లాలోని వల్లూరు పాలెం అనే మారుమూల గ్రామం. ఆయన నాగార్జున వర్సిటీలో గ్రాడ్యుయేషన్, 1977లో ఆంధ్రా వర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. 1988లో ఢిల్లీ వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసి కొన్నాళ్లు కెనడాలో అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత 1990లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఆప్ట్రో ఎలక్ట్రానిక్స్​, నానోటెక్నాలజీ రంగాల్లో పరిశోధన సంస్థను స్థాపించారు. ”రెండేళ్ల పాప, రెండు సంవత్సరాల కాంట్రాక్ట్​తో.. 31 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని అకాడమీకి వచ్చానని.. ఇప్పుడు దానికే నేతృత్వం వహిస్తానని అస్సలు అనుకోలేదు.” అని ప్రొఫెసర్​ చెన్నుపాటి జగదీశ్ సంతోషం వ్యక్తం చేశారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తానని జగదీశ్ స్పష్టం చేశారు. రాబోయే తరం యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం కూడా తన ప్రాధాన్యాంశాలని అన్నారు.

జగదీశ్​.. ఆస్ట్రేలియన్​ నేషనల్​ వర్సిటీలో ఫిజిక్స్​ ప్రొఫెసర్​గా పనిచేయడమే కాక.. సెమీ కండక్టర్​ ఆప్టో ఎలక్ట్రానిక్స్​, నానోటెక్నాలజీ విభాగాలకు అధిపతిగా, ఆస్ట్రేలియన్​ నేషనల్​ ఫాబ్రికేషన్​ ఫెసిలిటికీ డైరెక్టర్​గానూ సేవలందిస్తున్నారు. ఆస్ట్రేలియన్​ రీసర్చ్​ కౌన్సిల్​ నుంచి ఆయనకు ఫెడరేషన్​ ఫెలోషిప్​(2004-09), లేరెట్​ ఫెలోషిప్​(2009-14) లభించాయి. ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా.. 2016లో ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారానికి జగదీశ్​ను కూడా ఎంపిక చేసింది అక్కడి ప్రభుత్వం.

Read Also….  Harnaaz Sandhu: త్వరలోనే వెండితెరపై మిస్‌ యూనివర్స్‌! అప్పుడే రెండు సినిమాలకు సైన్‌!