Givenchy Fashion: ప్రస్తుత ప్రపంచం ఫ్యాషన్ మత్తులో ఊగిపోతోంది. ఏం చేసినా ట్రెండీగా ఉండనే ఆలోచనతో కొత్త కొత్త, వింత పోకడలకు పోతున్నారు జనాలు. అయితే, కొన్ని పాపులర్ అవుతుంటే.. మరికొన్ని అట్టర్ ప్లాప్ అయి విమర్శలపాలవుతున్నాయి. ముఖ్యంగా దుస్తుల విషయంలో ఈ ఫ్యాషన్ వెర్రి పెరిగిపోతోంది. చిరిగిన దుస్తులు ధరిస్తారు.. అదేమంటే ఫ్యాషన్ అంటారు. మనుషుల పోకడలకు తగ్గట్లుగానే.. కంపెనీలు కూడా కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ దుస్తుల కంపెనీ గివెంచీ రూపొందించిన దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ దుస్తులను చూసి నెటిజన్లు దుమ్మెత్తిపోతున్నారు. సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఏం దుస్తులు రూపొందించి.. నెటిజన్లు అంతగా మండిపడటానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా ఫ్రాన్స్ కంపెనీ గివెంచీ.. pring 2022-Ready to Wear collectionలో భాగంగా ఉరితాడును పోలి ఉన్న ఓ నెక్లెస్‌ను డ్రెస్‌కు అటాచ్ చేసింది. మోడల్స్ ఆ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ‘ఫ్యాషన్ అంటే ఆకట్టుకునేలా ఉండాలి. మరి మీరేం చేస్తున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆ ఉరితాడు వేసుకుని చావమని చెబుతున్నారా?. ఆత్మహత్య చేసుకోమని చెప్పడం ఫ్యాషన్ అవుతుందా?’ అంటూ నెటిజన్లు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందనకు గివెంచీ యాజమాన్యం షాక్ అయ్యింది. వెంటనే అలర్ట్ అయిన గివెంచీ క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ.. ఆ దుస్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ప్రజలకు క్షమాపణలు కూడా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also read:
Sonam Kapoor: సన్నజాజి సోనమ్ సొగసుకు ఫిదా అవ్వాల్సిందే.. బాలీవుడ్ బ్యూటీనా మజాకా..
Lottery: పాపం లక్ష్మీ దేవి కటాక్షించినా.. విధి కరుణించడం లేదు.. రూ. 20 కోట్లు మిస్ అయ్యేనా..!
Rashmi Gautam: రెడ్ డ్రెస్ లో రెడ్ హాట్ గా మెరిసిన ముద్ద మందారం.. అందాల రష్మీ లేటేస్ట్ ఫొటోస్..