న్యూజిలాండ్ కాల్పుల్లో ఐదుగురు భారతీయులు మృతి

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌ మసీదుల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు భారతీయులు మృతిచెందినట్లు భారత హై కమిషన్‌ కార్యాలయం వెల్లడించింది. వారి పేర్లు మహబూబ్‌ ఖోఖర్‌, రమీజ్‌ వోరా, ఆసీఫ్‌ వోరా, హన్సీఫ్‌ అలిబవ, ఓజైర్‌ ఖాదీర్‌‌గా హై కమిషన్ కార్యాలయం తెలిపింది. దాడిలో మరణించిన వారి సంఖ్య 50కి చేరినట్లు అక్కడి పోలీసు వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. న్యూజిలాండ్‌ మసీదుల్లో ఆస్ట్రేలియన్‌ ఉగ్రవాది శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది భారతీయులు […]

న్యూజిలాండ్ కాల్పుల్లో ఐదుగురు భారతీయులు మృతి

Updated on: Mar 17, 2019 | 12:12 PM

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌ మసీదుల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు భారతీయులు మృతిచెందినట్లు భారత హై కమిషన్‌ కార్యాలయం వెల్లడించింది. వారి పేర్లు మహబూబ్‌ ఖోఖర్‌, రమీజ్‌ వోరా, ఆసీఫ్‌ వోరా, హన్సీఫ్‌ అలిబవ, ఓజైర్‌ ఖాదీర్‌‌గా హై కమిషన్ కార్యాలయం తెలిపింది. దాడిలో మరణించిన వారి సంఖ్య 50కి చేరినట్లు అక్కడి పోలీసు వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

న్యూజిలాండ్‌ మసీదుల్లో ఆస్ట్రేలియన్‌ ఉగ్రవాది శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది భారతీయులు గల్లంతయినట్లు శనివారం అక్కడి భారత అధికారులు తెలిపారు. ఘటనను న్యూజిలాంగ్‌ ప్రధాని జసిండా అర్డెర్న్‌ ఉగ్రదాడిగా అభివర్ణించారు.