Brain Eating Amoeba: ముంచుకొస్తున్న కోవిడ్‌ని మించిన ప్రమాదం.. బ్రెయిన్ తినేసే కొత్త వైరస్.. తొలికేసు నమోదు..

|

Dec 27, 2022 | 9:20 PM

ఇప్పటి వరకు మహమ్మారి అంటే కోవిడ్.. మరి అంతకు మించిన మహమ్మారి ఇంకేదైనా రాబోతోందా.. లేదా ఆల్రెడీ వచ్చేందుకు సిద్ధంగా ఉందా.. అదే వస్తే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా..

Brain Eating Amoeba: ముంచుకొస్తున్న కోవిడ్‌ని మించిన ప్రమాదం.. బ్రెయిన్ తినేసే కొత్త వైరస్.. తొలికేసు నమోదు..
Brain Eating Amoeba
Follow us on

ఇప్పటి వరకు మహమ్మారి అంటే కోవిడ్.. మరి అంతకు మించిన మహమ్మారి ఇంకేదైనా రాబోతోందా.. లేదా ఆల్రెడీ వచ్చేందుకు సిద్ధంగా ఉందా.. అదే వస్తే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా.. తాజాగా దక్షిణ కొరియాలో సంభవించిన ఓ మరణం వైద్య లోకాన్ని వణుకుపుట్టిస్తోంది. ఇంతకీ ఏమిటా మహమ్మారి..? అంతగా ఎందుకు భయపడుతున్నారు? బ్రెయిన్ ఈటింగ్ అమీబా.. కోవిడ్ తర్వాత ప్రపంచాన్ని కంగారు పెట్టేందుకు సిద్ధమవుతున్న మరో సమస్య ఇది. ఇప్పటికే మళ్లీ కోవిడ్ గుప్పెట్లోకి ప్రపంచం జారుకుంటోందన్న భయాలు సర్వత్రా అలముకున్న నేపథ్యంలో తాజాగా దక్షిణ కొరియాలో సంభవించిన ఓ మరణం ఇప్పుడు వైద్యలోకాన్ని కంగారు పెడుతోంది.

దక్షిణ కొరియాలో తొలి బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు..

ఇటీవలే దక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తి నాలుగు నెలల పాటు థాయిల్యాండ్‌లో గడిపి డిసెంబర్ 10న తిరిగి స్వదేశానికి వచ్చారు. వచ్చిన కొద్ది రోజులకే తలనొప్పి, జ్వరం, వాంతులు, మాట తడబడటం, మెడపట్టేయడం వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందులతోనే సరిగ్గా 11 రోజులు తిరిగే సరికి ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు పోస్ట్ మార్టం రిపోర్టులో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అన్న వ్యాధి కారణంగానే ఆ వ్యక్తి మరణించినట్టు తేలింది. ఈ తరహా మరణం దక్షిణ కొరియాలో మొట్టమొదటిదని కొరియా డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఇది మనుషుల్లో ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుందా.. లేదా అన్న అంశంపై మాత్రం ఆ సంస్థ ఎటూ తేల్చలేదు.

154 మందిలో నలుగురే మిగిలారు..

అసలు ఏమిటీ బ్రెయిన్ ఈటింగ్ అమీబా… ఈ ప్రశ్నకొస్తే దీన్నే నెగ్లిరియా ఫొవరీ ఇన్ఫెక్షన్ అని కూడా పిలుస్తారు. ఈ వైరస్ మట్టిలో, చెరువులు, సరస్సులు, నదుల్లోనూ కనిపిస్తుంటుంది. సరిగ్గా క్లోరినేషన్ చెయ్యని స్విమ్మింగ్ పూల్స్‌ కూడా ఈ వైరస్‌కు ఆవాసం. వాటిల్లో స్నానం చేసే సమయంలో నోటీ ద్వారా లేదా, ముక్కు ద్వారా నీళ్లు లోపలికి వెళ్లినప్పుడు ఈ వైరస్ శరీరానికి సోకుతుంది. 1962 నుంచి 2021 ఇప్పటి వరకు అమెరికాలో ఈ వ్యాధి 154 మందికి సోకగా.. కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఈ ఒక్క గణాంకాలు చాలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధి ఎంత భయంకరమైనదో చెప్పడానికి.

వ్యాధి సోకిన వెంటనే గుర్తించడం సాధ్యం కాదు..

ఇందులో మరో ప్రధానమైన సమస్య వ్యాధి సోకిన మొదట్లో దీన్ని గుర్తించడం సాధ్యం కాదు. ఒక్కసారి సోకిందటే చాలా వేగంగా శరీరంలోకి వ్యాపిస్తుంది. సాధారణంగా మనిషి ప్రాణాలు పోయిన తర్వాత మాత్రమే ఈ వ్యాధిని గుర్తించగలం. ఈ వ్యాధి సోకిన తర్వాత మొదటి స్టేజ్‌లో తలనొప్పి, జ్వరం, జలుపు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే రెండో స్టేజిలో రోగి మానసిక పరిస్థితి అస్తవ్యస్తమవుతుంది. హేలోజినేషన్‌కి కూడా గురవుతారు. ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లిపోతారు. ప్రస్తుతానికి ఈ వ్యాధికి ఎలాంటి వ్యాక్సీన్ లేదు. అయితే కొంత వరకు నయం చేసే అవకాశం కూడా లేకపోలేదు. కానీ అ అవకాశాలు చాలా చాలా స్వల్పం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..