Russian, Ukraine War: ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం..? రష్యా పర్యాటకులపై ఫిన్లాండ్ ఆంక్షలు..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనానికి రష్యా వేసిన ఎత్తుగడ ఫలించింది. దీంతో 8 సంవత్సరాల క్రితం క్రిమియా ఆక్రమణ తరహాలోనే ఉక్రెయిన్ కు చెందిన మరో..

Russian, Ukraine War: ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం..? రష్యా పర్యాటకులపై ఫిన్లాండ్ ఆంక్షలు..
Russia Ukraine Map (Photo Credit Google)
Follow us

|

Updated on: Sep 30, 2022 | 10:05 AM

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనానికి రష్యా వేసిన ఎత్తుగడ ఫలించింది. దీంతో 8 సంవత్సరాల క్రితం క్రిమియా ఆక్రమణ తరహాలోనే ఉక్రెయిన్ కు చెందిన మరో నాలుగు ప్రాంతాల విలీనానికి రష్యా ముహుర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారం క్రెమ్లిన్‌ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో విలీనం చేసుకోనుంది రష్యా. క్రెమ్లిన్ ప్యాలెస్ లోని జార్జియన్ హాలులో జరిగే కార్యక్రమంలో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక ప్రకటన చేయనున్నారు. దీంతో కొత్త సరిహద్దులు రష్యాలో చేరనున్నాయి. ఫిబ్రవరి నుంచి మొదలైన ఆక్రమణలో భాగంగా.. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని లుగన్‌స్క్‌, డోనెట్‌స్క్‌, ఖేర్‌సన్‌, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా సైన్యం ఇదివరకే ఆక్రమించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పౌరులు రష్యాలో చేరేందుకు సుముఖంగా ఉన్నారంటూ ఆయా ప్రాంతాల్లో క్రెమ్లిన్‌ నియమించిన రష్యన్‌ అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము విలీనం చేసుకుంటున్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది.

శుక్రవారం క్రెమ్లిన్‌లో జరిగే కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పాల్గొంటారు. అలాగే ఆయా ప్రాంతాలకు చెందిన మాస్కో అనుకూల పరిపాలకులు సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఈ రెఫరెండంపై ఉక్రెయిన్‌ సహా వివిధ దేశాల్లో అభ్యంతరాలు ఉన్నప్పటికీ విలీన ఏర్పాట్లు మాత్రం రష్యా అధికారులు పూర్తిచేశారు. మరోవైపు జాతీయ భద్రత, రక్షణ మండలి అత్యవసర సమావేశాన్ని సెప్టెంబర్ 30(శుక్రవారమే)వ తేదీన నిర్వహించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిర్ణయించారు. రష్యా ఆక్రమణలపై ఈసమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. జపోరిజియా, ఖేర్సన్‌, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలు రష్యాలో విలీనానికి అంగీకారం తెలిపాయని వ్లాదిమిర్ పుతిన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపోరిజియాలో 93%, ఖేర్సన్ లో 87%, లుహాన్స్క్ లో 98%, డొనెట్ స్క్ లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు ఇప్పటికే వెల్లడించారు. రష్యా వైఖరిపై ఉక్రెయిన్, అమెరికా సహా మరికొన్ని దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశ్చిమ దేశాలు రష్యా వ్యవహర శైలిని ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండాన్ని, విలీనాన్ని తాము గుర్తించబోమన్నారు. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ తెలిపింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా సెనేట్‌ విదేశీ వ్యవహారాల కమిటీకి ఆ దేశ ఆర్థిక, విదేశాంగ శాఖల అధికారులు సూచించారు. ఆశించిన స్థాయిలో తొలివిడత ఆంక్షల దెబ్బ రష్యాకు తగల్లేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రష్యాపై ఫిన్లాండ్ ఆంక్షలు విధించింది. టూరిస్ట్ వీసాలపై రష్యా నుంచి వచ్చే వారిపై నిషేధం విధిస్తున్నట్లు ఫిన్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. రష్యా నుంచి నిరంతరం వస్తున్న పర్యాటకుల కారణంగా తమ అంతర్జాతీయ సంబంధాలు ప్రమాదంలో పడుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. సరిగ్గా ఉక్రెయిన్ కు చెందిన నాలుగు ప్రాంతాల విలీనానికి ముహుర్తం ఖరారు చేసిన రోజైన సెప్టెంబర్ం 30(శుక్రవారం) నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఫ్లిన్లాండ్ విదేశాంగ శాఖ మంత్రి పెక్కా హావిస్తో వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..