ఇంటి అద్దె నెలకు ఎంత ఉంటుంది.. మహా అయితే ఓ 12 వేల నుంచి 15 వేల రూపాయలు వరకు ఉంటుంది. ఖరీదైన ఏరియాల్లో అయితే ఓ రూ.20వేలు ఉండొచ్చు. ఇంకా ఖరీదైన ప్రాంతాల్లో అయితే రూ.30 వేలు వరకు ఉండొచ్చు. కానీ ప్రఖ్యాత నగరం లండన్ లో ఇంటి అద్దెలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏకంగా రూ.3లక్షలకు ఎగబాకింది. ఇది సంవత్సరానికి కాదండోయ్.. నెలకు మాత్రమే. నమ్మకం కలగకపోయినా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే.. ఐరోపా దేశం బ్రిటన్ ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వీటితో పాటు జీవన వ్యయాలు అధికంగా ఉన్న ఆ దేశ రాజధాని నగరం లండన్ లో ఇంటి అద్దె లు మరింత ఖరీదైన వ్యవహారంగా మారాయి.
మూమాలుగానే భారీగా ఉండే ఈ అద్దెలు.. ఇప్పుడు మరింత ఎగబాకాయని వార్తా కథనాలు వెల్లడించాయి. నగరంలో లోపల రూ.3 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో అద్దెలు పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతేడాది చివరి త్రైమాసికంలో ఆ మొత్తం రూ.2,50,000 గా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ స్థాయి అద్దెలు చెల్లించలేక చాలా మంది నగర శివార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
అద్దెకు వచ్చే వ్యక్తులు ధరల్ని భరించగలిగేలా, ఎక్కువ ధరల వల్ల ఇళ్లు ఖాళీగా ఉండకుండా చూసేలా ఇంటి యజమానులు ధరలు అందుబాటులో ఉంచాలని సూచించింది. కాగా ప్రస్తుత పరిస్థితిని కొందరు సొమ్ము చేసుకుంటుండటం గమనార్హం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..