Elon Musk: ఎలాన్ మస్క్ ప్రేమ విత్తనాలు అందుకేనా?.. పెద్ద ప్లానింగే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

ఎలాన్ మస్క్‌కు సంబంధించిన మరో సంచలనాత్మక వార్త సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. జపాన్‌లో ఒక ఉన్నతస్థాయి మహిళకు మస్క్ వీర్య దానం చేసినట్లు సమాచారం. అదే సమయంలో, క్రిప్టో ఇన్‌ఫ్లూయెన్సర్ టిఫనీ ఫాంగ్‌ను సంతానం కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, ఫాంగ్ ఈ సందేశాలను బహిర్గతం చేయడంతో మస్క్ ఆమెను సామాజిక మాధ్యమాల్లో అన్‌ఫాలో చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం ఆర్థిక ఒప్పందాలు, రహస్య ఒడంబడికల ద్వారా నడుస్తున్నట్లు సూచనలు ఉన్నాయి.

Elon Musk: ఎలాన్ మస్క్ ప్రేమ విత్తనాలు అందుకేనా?.. పెద్ద ప్లానింగే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Elon Musk Legion Controversy

Updated on: Apr 19, 2025 | 4:53 PM

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్‌కు సంబంధించిన మరో వివాదాస్పద కథనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మస్క్ తన సంతానాన్ని “లీజియన్”గా విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే తన జన్యుపరమైన సంతానాన్ని భారీగా విస్తరించే ప్లాన్ లో ఉన్నాడని సమాచారం. అయితే ఇప్పటికే ఒకరితో సహజీవనం చేస్తున్న మస్క్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం భారీగా వెచ్చిస్తున్నాడు. ఈ రహస్యం ధర 15 మిలియన్ డాలర్లని అంటున్నారు. అంటే దాదాపు రూ. 1 లక్ష కోట్లు.

పెద్ద ప్లానింగే..

మస్క్ న్యూరాలింక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్, మస్క్ బయోగ్రాఫర్‌తో మాట్లాడుతూ, “ఆయన తెలివైన వ్యక్తులు సంతానాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు” అని చెప్పినట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. సంతానం కోసం సిద్ధమైనప్పుడు, మస్క్ తన స్పెర్మ్‌ను దానం చేయాలని సూచించారని, తద్వారా బిడ్డలు జన్యుపరంగా తనవారు కావాలని భావించారని సమాచారం. ఈ వార్త బయటకు పొక్కడంతో మస్క్ మెదడులో ఇంత పెద్ద ప్లాన్ ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా అతడు భవిష్యత్తులో ఏమేం చేయబోతున్నాడా అని ఆలోచనలో పడిపోతున్నారు.

వారితో రహస్య ఒప్పందాలు..

ఈ ప్రక్రియలో రహస్య ఒప్పందాలు, ఆర్థిక ఒప్పందాలు ఉన్నాయని, వీటిని మస్క్ సన్నిహిత సహాయకుడు జారెడ్ బిర్చాల్ నిర్వహిస్తారని కథనం సూచిస్తోంది. ఉదాహరణకు, మస్క్‌తో ఇప్పటికే బిడ్డను కన్న యాష్లీ స్టె. క్లైర్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, తన బిడ్డ రహస్యంగా ఉంచాలని మస్క్ బృందం నుండి 15 మిలియన్ డాలర్ల ఆఫర్‌ను అందుకున్నట్లు వెల్లడించారు. ఆమె ఈ ఒప్పందాన్ని తిరస్కరించారని, తన బిడ్డను రహస్యంగా ఉంచడం ఇష్టం లేదని తెలిపారు.

ఎక్స్‌లో దీని గురించే గుసగుస..

మస్క్ ఇప్పటికే 14 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు. వీరిలో నలుగురు వేర్వేరు తల్లుల నుండి జన్మించారు. మస్క్ ఈ ప్రయత్నాలు, ప్రపంచ జనాభా తగ్గుదలను ఎదుర్కోవడానికి తన వంతు కృషి చేయాలనే ఆయన ఆలోచన నుండి ఉద్భవించినవని చెబుతున్నారు. అయితే, ఈ కథనం మస్క్ వ్యక్తిగత జీవితంలోని సంక్లిష్టతలను, ఆయన చుట్టూ ఉన్న వివాదాలను మరింత లోతుగా చర్చించేలా చేస్తోంది. ఈ విషయంపై మస్క్ నుండి ఇంకా అధికారిక స్పందన రాలేదు. ఈ కథనం సోషల్ మీడియాలో, ప్రత్యేకించి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది.