Japan Earthquake: జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదు!

|

Apr 02, 2025 | 8:48 PM

ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల జపాన్ ప్రభుత్వం ఓ షాకింగ్‌ రిపోర్ట్‌ విడుదల చేసింది. ఇది ఇప్పుడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. భవిష్యత్తులో ఓ భారీ భూకంపం సంభవించబోతోందని హెచ్చరించింది. రాబోయే ఈ భారీ భూకంపం కారణంగా..

Japan Earthquake: జపాన్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదు!
Earthquake
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌లో వచ్చిన భారీ భూకంపం ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీ ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడు తాజాగా జపాన్‌లో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌కు పొరుగునే ఉన్న మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. ఆ దేశాల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

అయితే ప్రకృతి విపత్తులు ఎప్పుడూ మనుషుల జీవితాన్ని ఊహించని రీతిలో ప్రభావితం చేస్తాయి. భూకంపాలు, సునామీలు వంటివి సెకన్లలో సర్వం కోల్పోయేలా చేస్తాయి. జపాన్ లాంటి దేశాల్లో ఈ రిస్క్‌ మరింత ఎక్కువగా ఉంటుంది.

అయితే ఇటీవల జపాన్ ప్రభుత్వం ఓ షాకింగ్‌ రిపోర్ట్‌ విడుదల చేసింది. ఇది ఇప్పుడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. భవిష్యత్తులో ఓ భారీ భూకంపం సంభవించబోతోందని హెచ్చరించింది. రాబోయే ఈ భారీ భూకంపం కారణంగా సుమారు 3 లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి