
పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ మొదలైంది. శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని ప్రపంచం రిలాక్స్ అవుతున్నవేళ, క్షిపణులు గర్జించాయి. యుద్ధం మొదలైన 100 రోజుల తర్వాత కూడా మిసైళ్ల హోరు అక్కడి జనాన్నే కాదు,ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా అమెరికా హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చేయడంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ క్రమంతో ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ రాత్రికి ఇరాన్‌పై అమెరికా గట్టి దాడికి పాల్పడబోతుందని ప్రకటించాడు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్, విమాన నిరోధక వ్యవస్థలు, అన్ని ఇతర రక్షణ వ్యవస్థలు అమెరికా దాడిలో నాశనమైపోయాయన్నారు. సమీప భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో, మేము ఖార్గ్ ద్వీపాన్ని, ఇతర చమురు మౌలిక సదుపాయాల కేంద్రాలను స్వాధీనం చేసుకుని, వారి చమురు, గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణను సాధిస్తాంమన్నారు. వెనిజులా విషయంలో మేము చేసినట్లే ఇది కూడా ఉంటుందన్నారు. ఇది వెనిజులా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండింటికీ అద్భుతంగా కలిసి వస్తోందదని చెప్పుకొచ్చారు.
Donald Trump Warns Iran
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.