Burj Khalifa: ఆర్కిటెక్చర్ అద్భుతం.. బుర్జ్ ఖలీఫా అసలు ఓనర్ ఎవరో తెలుసా?

ఆర్కిటెక్చర్ ఆద్భుతం.. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గురించి అందిరికే తెలిసే ఉంటుంది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ గ్రూప్‌ నిర్మించిన ఈ బుర్జ్ ఖలీఫాను అందరూ ప్రభుత్వ భవనం అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఈ భవనం దుబాయ్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఎమార్ ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఇంతకు ఈ భవనం అసలు ఓనర్ ఎవరో తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

Burj Khalifa: ఆర్కిటెక్చర్ అద్భుతం.. బుర్జ్ ఖలీఫా అసలు ఓనర్ ఎవరో తెలుసా?
Burj Khalifa

Updated on: Oct 25, 2025 | 2:25 PM

ఆర్కిటెక్చర్ ఆద్భుతం.. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గురించి అందిరికే తెలిసే ఉంటుంది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ గ్రూప్‌ నిర్మించిన ఈ బుర్జ్ ఖలీఫాను అందరూ ప్రభుత్వ భవనం అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఇదొక ప్రైవేట్ వ్యక్తి చెందిన భవనం. కానీ ఇది చాలా మందికి తెలియదు. అవును ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనం ఎమ్మార్ గ్రూప్స్‌ యజమాని మొహమ్మద్ అలబ్బర్ అనే వ్యాపారవేత్తకు చెందినది. ఆయన దుబాయ్‌కు చెందిన పేరు మోసిన రియల్ ఎస్టేట్ దిగ్గజం.

1956లో జన్మించిన మొహమ్మద్ అలబ్బర్‌.. దుబాయ్‌లో పుట్టి పెరిగారు. కుటుబంలో ఆర్ధిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఈయన కష్టపడి తన చదువును పూర్తి చేసుకున్నాడు. దుబాయ్‌లో స్టడీస్‌ పూర్తైన తర్వాత అమెరికా వెళ్లిన అలబ్బర్ సియాటిల్ వర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టాపొందారు. తర్వాత పలు ఉద్యోగాలు చేసిన ఈయన 1997లో ఎమ్మార్ ప్రాపర్టీస్ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థను స్థాపించారు.

దుబాయ్‌ను ప్రపంచ రియల్ ఎస్టేట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో అబ్బర్ స్థాపించిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్ 2000 సంవత్సరాల్లో చేపట్టిన ఒక ప్రాజెక్ట్‌తో ఆయనతో పాటు దుబాయ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చి పెట్టింది. అదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జు ఖలీఫా భవనం నిర్మాణ ప్రాజెక్టు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్ నిర్మించిన ఈ ప్రాజెక్టు.. కేవలం ఎత్తైన భవనంగానే కాదు. దుబాయ్ ప్రతిష్టకు ప్రతీకగా నిలిచింది.

(NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదిక నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడిన.. వీటీపై మీకు ఏవైనా సందేహాలు, ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.