డిస్నీ, ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఫాక్స్ డీల్ విలువ‌ రూ.5,00,000 కోట్లు

| Edited By:

Mar 21, 2019 | 11:38 AM

ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ ఫాక్స్‌ కంపెనీ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారాన్ని డిస్నీ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ డీల్‌ విలువ 7,100 కోట్ల డాలర్లు మేర ఉంటుంది. మన కరెన్సీలు దాదాపు రూ.5,00,000 కోట్లు. ఒప్పందంలో భాగంగా ఫాక్స్‌ సంస్థకు చెందిన ఫాక్ద్ ఫిల్మ్ మరియు టీవీ స్టూడియో, ఎఫ్‌ఎక్స్ నెట్‍వర్క్స్, నేషనల్ జియోగ్రఫిక్, స్టార్ ఇండియా హులు స్ట్రీమింగ్‌ సర్వీస్‌లో ఫాక్స్‌కు ఉన్న 30 శాతం వాటాపై హక్కులు డిస్నీకి లభిస్తాయి. డీస్నీ సంస్థ, డిస్నీ ప్లస్‌ పేరుతో […]

డిస్నీ, ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఫాక్స్ డీల్ విలువ‌ రూ.5,00,000 కోట్లు
Follow us on

ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ ఫాక్స్‌ కంపెనీ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారాన్ని డిస్నీ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ డీల్‌ విలువ 7,100 కోట్ల డాలర్లు మేర ఉంటుంది. మన కరెన్సీలు దాదాపు రూ.5,00,000 కోట్లు.

ఒప్పందంలో భాగంగా ఫాక్స్‌ సంస్థకు చెందిన ఫాక్ద్ ఫిల్మ్ మరియు టీవీ స్టూడియో, ఎఫ్‌ఎక్స్ నెట్‍వర్క్స్, నేషనల్ జియోగ్రఫిక్, స్టార్ ఇండియా హులు స్ట్రీమింగ్‌ సర్వీస్‌లో ఫాక్స్‌కు ఉన్న 30 శాతం వాటాపై హక్కులు డిస్నీకి లభిస్తాయి. డీస్నీ సంస్థ, డిస్నీ ప్లస్‌ పేరుతో ఈ సర్వీసులన్నీ అందించనుంది. స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి కంపెనీలకు డిస్నీ గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఫాక్స్‌ కీలక వ్యాపారాల కొనుగోలు అమల్లోకి రావడంతో స్టార్‌ ఇండియా, నేషనల్‌ జియోగ్రఫిక్‌, టాటా స్కైల మొత్తం ప్రసార వ్యాపారం కూడా డిస్నీ చేతిలోకి వచ్చాయి. ప్రస్తుంది హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రాంతీయ భాషల్లో స్టార్‌ ఇండియాకు 50కి పైగా ఛానళ్లు ఉన్నాయి. హాట్‌స్టార్‌ కూడా స్టార్‌ ఇండియాలో భాగంగానే ఉంది. కాగా డిస్నీ, ఫాక్స్‌ రెండు కంపెనీలు సినిమా రంగంలో ఉండటంతో ఇరు సంస్థల్లో 4,000 ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

వాల్ట్ డిస్నీ కంపెనీ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ ఐగెర్ మాట్లాడుతూ “ఇది మాకు ఒక అసాధారణ మరియు చారిత్రక క్షణం – మా సంస్థ మా వాటాదారులకు ముఖ్యమైన దీర్ఘకాల విలువను సృష్టిస్తుంది” అని ప్రశంసించారు.