ఫ్యామిలీతో షాపింగ్‌కు వెళ్లిన తండ్రి..కొడుకు అల్లరితో రూ3.30లక్షలు ఫైన్‌..ఎక్కడంటే..

|

May 24, 2022 | 7:12 PM

ఓ కొడుకు చేసిన అల్లరి ఆ తండ్రికి పెను భారంగా మారింది. ఏకంగా రూ.3.30లక్షలు స్టోర్‌ నిర్వాహకులకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫ్యామిలీతో షాపింగ్‌కు వెళ్లిన తండ్రి..కొడుకు అల్లరితో రూ3.30లక్షలు ఫైన్‌..ఎక్కడంటే..
Dad Pays
Follow us on

సూపర్‌ మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు పిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు. వారు చేసే సందడికి కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులు కూడా సహనం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. షాపులో ఉండే బొమ్మలు, ఆటవస్తువులు, తినే పదార్థలను కోరుతూ పిల్లలు నానా హంగామా చేయటం శరమామూలుగానే ఉంటుంది. అయితే,ఇక్కడ కూడా ఓ కొడుకు చేసిన అల్లరి ఆ తండ్రికి పెను భారంగా మారింది. ఏకంగా రూ.3.30లక్షలు స్టోర్‌ నిర్వాహకులకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగింది..? ఎక్కడ జరిగింది అన్నది పరిశీలించినట్టయితే….

హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి షాపింగ్‌ మాల్‌కి వెళ్లాడు..భార్య, ఇద్దరు కుమారులతో కలిసి లాంగ్‌హామ్ ప్లేస్ మాల్‌లోని KK ప్లస్ అనే దుకాణానికి వెళ్లారు. అక్కడ తన కొడుకు చేసిన అల్లరికి అతడు అక్షరాల రూ.3.30ల ఫైన్‌ కట్టాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఆధారంగా.. మాల్‌లో చెంగ్‌ అతని ఫ్యామిలీ షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. అంతలోనే ఓ పెద్ద శబ్ధం వినబడింది…ఏంటని చూడగా, 1.8 మీటర్ల బంగారు వర్ణం కలిగి ఉన్న టెలీటబ్బీస్ బొమ్మ కిందపడి పగిలిపోయి ఉంది. దాని తల తెగిపోయింది, ఒక చేయి విరిగిపోయింది. టెలీటబ్బీస్‌ బొమ్మ నేలపై ముక్క ముక్కలుగా విరిగిపోయి కనిపించింది. ఆ పక్కనే తన కొడుకు నేలకేసి బొమ్మనే చూస్తూ కనిపించాడు. షాప్‌ సిబ్బంది ఆరోపించిన దాని మేరకు తన కొడుకే ఆ బొమ్మను విరగొట్టాడని చెప్పారు.అందుకు అంగీకరించని చెంగ్‌ సీసీ కెమెరా ఫుటేజ్‌ చెక్‌ చేయగా, తన సుపుత్రుడే ఆ బొమ్మను తన్నినట్టుగా తెలిసింది. ఇక దాంతో తప్పనిసరిగా షాప్‌వారు వేసిన ఫైన్‌ మొత్తం కట్టాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మీరు మీపిల్లలతో షాపింగ్‌ వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి..లేదంటే ఇలాంటి ఫైన్లు పడే అవకాశం ఉంది మరీ..బీ కేర్‌ఫుల్‌…