Srilanka Crisis: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. ఏప్రిల్ తరువాత పెనం మీద నుంచి పొయ్యిలోకి..

|

Apr 08, 2022 | 7:17 PM

Srilanka Crisis: శ్రీలంకలో కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ మరింతగా ముదురుతోంది. ఆర్థిక, ఆహార, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, కరెంటు కోతలు, విదేశీ మారక నిల్వలు వంటి అనేక సమస్యలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.

Srilanka Crisis: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. ఏప్రిల్ తరువాత పెనం మీద నుంచి పొయ్యిలోకి..
Srilanka Crisis
Follow us on

Srilanka Crisis: శ్రీలంకలో కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభం(Economic Crisis) రోజురోజుకీ మరింతగా ముదురుతోంది. ఆర్థిక, ఆహార, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం(Inflation), ఇంధన కొరత, కరెంటు కోతలు, విదేశీ మారక నిల్వలు అడుగంటడంతో పాటు అనేక సమస్యలు లంకను ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనాతో పాటు లంక ప్రభుత్వాలు చైనా విషయంలో చేసిన అనేక తప్పులు ఇప్పుడు ఆ దేశానికి శాపాలుగా మారాయి. ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జనం రోడ్లెక్కి ఆగ్రహావేశాలు వెల్లగక్కడంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

విదేశీ మారక నిల్వల కొరత శ్రీలంకను కకావికలం చేస్తోంది. ఇంధన కోనుగోళ్ల కోసం ద్వీపదేశానికి భారత్ USD 500 మిలియన్ల క్రెడిట్‌ ఇప్పటికే అందించింది. ప్రస్తుతం శ్రీలంకలోని డీజిల్ నిల్వలు నెలాఖరు వరకు సరిపోతాయి. ఏప్రిల్ తరువాత ఇంధన నిల్వలు అడుగంటడంతో ఆ దేశ పరిస్థితి మరింత దిగజారనుంది. 1948 నుంచి స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుదీర్ఘ విద్యుత్ కోతలు, ఆకాశాన్ని అంటిన వంట గ్యాస్, ఆహారం, ఇతర ప్రాథమిక వస్తువుల కొరతపై ప్రజలు వారాలుగా నిరసనలు చేస్తున్నారు. ప్రజల ఆగ్రహం దాదాపు క్యాబినెట్ మంత్రులందరినీ రాజీనామాల వైపు నడిపించింది. ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స ప్రభుత్వం నుంచి అనేక మంది శాసనసభ్యులు వైదొలిగారు.  లంకలో డీజిల్ ను ప్రజా రవాణా, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి విస్తృతంగా ఉపయోగిస్తారు. డీజిల్ కొరత కారణంగా కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు మూసివేయడం వల్ల ఇప్పటికే రోజుకు 10 గంటలకు పైగా విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి. దిగుమతులకు చెల్లించేందుకు డబ్బులేక అక్కడి ఏకైక రిఫైనరీ ఇప్పటికే రెండు సార్లు మూతపడింది. ఫారెక్స్ సంబంధిత ఆర్థిక సంక్షోభం కారణంగా ద్వీప దేశంలో కీలక ఔషధాల కొరత గురించి ఇప్పటికే శ్రీలంక మెడికల్ అసోసియేషన్ (SLMA) అధ్యక్షుడు రాజపక్సేను హెచ్చరించారు.

గత 24 గంటల్లో 36,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ భారత్ క్రెడిట్ రూపంలో శ్రీలంకకు డెలివరీ చేసింది. భారతదేశ సహాయం కింద వివిధ రకాల ఇంధనాల మొత్తం సరఫరా ఇప్పుడు 2,70,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువకు చేరిందని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. గత వారం 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ద్వారా భారత సహాయం కింద 40,000 MT డీజిల్‌ను శ్రీలంక ఇంధన మంత్రి గామిని లోకుగేకి భారత హైకమిషనర్ అందజేశారు. అనేక విధాలుగా శ్రీలంకకు భారత్ సహాయం చేస్తున్నప్పటికీ అవి అక్కడి పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దేందుతు సరిపోవటం లేదని తెలుస్తోంది.

 

ఇవీ చదవండి..

Zerodha Offer: ఉద్యోగులకు ఆఫర్.. బరువు తగ్గితే బోనస్ ఇస్తానంటున్న ఆ కంపెనీ సీఈవో

Satya Nadella: ఉద్యోగులతో అలా పనిచేయించవద్దన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల.. కీలక సూచనలు..