Posh Spice New Record: రెండు కోట్లకు పైగా అమ్ముడు పోయి సరికొత్త వరల్డ్ రికార్డ్‌ను సృష్టించిన ఆవు..స్పెషాలిటీ ఏమిటంటే!.

|

Feb 09, 2021 | 7:07 PM

ఆవు, దున్నపోతుల ధరలు సాధారణంగా లక్షల్లో ఉంటాయి.. బహు అరుదైన జాతి ఐతే కోటి రూపాయల ధర పలుకుతుందేమో.. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆవు ధర అక్షరాలా రెండు కోట్లు పైమాటే..

Posh Spice New Record: రెండు కోట్లకు పైగా అమ్ముడు పోయి సరికొత్త వరల్డ్ రికార్డ్‌ను సృష్టించిన ఆవు..స్పెషాలిటీ ఏమిటంటే!.
Follow us on

Posh Spice Set New Record: ఆవు, దున్నపోతుల ధరలు సాధారణంగా లక్షల్లో ఉంటాయి.. బహు అరుదైన జాతి ఐతే కోటి రూపాయల ధర పలుకుతుందేమో.. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆవు ధర అక్షరాలా రెండు కోట్లు పైమాటే.. మరి అంత ఖరీదైన ఆవు స్పెషాలిటీ ఏమిటి..? అది ఎక్కడ ఉంది తెలుసుకుందాం..

భారీ ధరకు అమ్ముడైన ‘పోష్ స్పైస్’ అనే ఆవు రూ. 2 కోట్ల 62 లక్షలకు అమ్ముడుపోయి.. బ్రిటన్‌లో అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డుల్లోకి ఎక్కింది. కాగా బ్రిటన్‌లో సగటు ఇంటి ఖరీదు కన్నా, దీని ధరే ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఆవు పూర్తి పేరు విలోడ్జ్ పోష్‌స్పైస్ కాగా, అత్యధిక ధరకు అమ్ముడుపోయి గత రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచంలో అత్యుత్తమ జాతి ఆవుల్లో ఇదీ ఒకటి కావటంతో వేలంలో ఏకంగా 2,62,000 పౌండ్లకు అమ్ముడైపోయింది. అంటే మన భారత కరెన్సీలో 2.61 కోట్లు. లిమోసిన్ జాతికి చెందిన ‘పోష్ స్పైస్’ బ్రిటన్‌లోనే కాక యూరప్ మొత్తంలోనూ అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది.

నవంబర్ 2019లో జన్మించిన ఈ ఆవును ష్రాప్‌షైర్‌లోని షిఫ్నాల్‌కు చెందిన క్రిస్టీన్ విలియమ్స్, పాల్ టిప్పెట్స్‌ పెంచుకుంటున్నారు. ఈ ఆవులు కాస్త రఫ్‌గా ఉంటాయట. ఇటువంటి జాతిని 1989 నుంచి డాన్, ఆయన కూతురు, రైతు అయిన క్రిస్టీన్ విలియమ్స్ పెంచుతున్నారు. ఓ ఆవుకి పుట్టిన నాలుగు దూడలను వీరు కాపాడి పెంచి పెద్దచేశారు. ఆ దూడల తల్లి చనిపోయింది. దీంతో వారు ఆ దూడల్ని అతి జాగ్రత్తగా పెంచి పోషించారు. ఈ ఆవు ఇంత ఎక్కువ ధరకు అమ్ముడవ్వడంపై క్రిస్టీన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత ధర పలుకుతుందని మేం అస్సలు అనుకోదన్నారు.

కుంబ్రియాలోని కార్లిస్లేలో ఇటీవలే నిర్వహించిన వేలంలో పోష్ స్పైస్ ఆకారం, స్టైల్‌తో పాటు దాని జన్యు లక్షణాలు చాలా మంది బిడ్డర్ల దృష్టిని ఆకర్షించాయి. అంతేకాదు, పోష్ స్పైస్‌కు జన్మనిచ్చిన తల్లి ‘జింజర్ స్పైస్’ కారణంగా ఆ ఆవు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రసిద్ధ ‘బాల్మోరల్ షో’లో ‘జింజర్ స్పైస్’ మూడుసార్లు విజేతగా నిలవడమే అందుకు కారణం. ఉత్తర ఐర్లాండ్‌లో జరిగే అతిపెద్ద అగ్రి-ఫుడ్ ఈవెంట్ ‘బాల్మోరల్ షో’ కాగా, ఇది ప్రతి ఏటా మే నెలలో లిస్బర్న్‌లోని బాల్మోరల్ పార్క్‌లో జరుగుతుంది. ఇందులో షోజంపింగ్ పోటీలు, మోటారుసైకిల్ ప్రదర్శనలతో పాటు గుర్రాలు, పశువులు, గొర్రెలు, కోళ్లు, పందులు మరియు మేకల పదర్శనలు జరుగుతాయి. 1855 సంవత్సరం నుంచి ఈ షో నిర్వహిస్తున్నారు.

Also Read:

వికెట్ తీయలేదు, క్యాచ్ పట్టలేదు.. అనూహ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందాడు.. ఆ బౌలర్ ఎవరంటే.!

భారతీయ సంప్రాయమైన చీర, ధోతి లో ఎన్ఆర్ఐ జంట స్కీయింగ్‌. వైరల్ అవుతున్న వీడియో