Bumper Offer: పనిచేసే ఎంప్లాయీస్‌కి కంపెనీలు బోనస్‌లు ఇవ్వడం, శాలరీలు పెంచడం చేస్తుంటాయి. ఆయా సంస్థ నిబంధనలు, లాభాలను బట్టి ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీరుస్తాయి. ఇది ఎక్కడైనా జరిగేదే. కానీ ఓ సంస్థ తమ సిబ్బందికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. చైనాలోని ఓ కంపెనీ రెండో సారి, మూడో సారి బిడ్డలను కనేవారికి బంపర్ ఆఫర్లు ప్రకటించింది. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది.
చైనా రాజధాని బీజింగ్‌లో గల దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ మూడో బిడ్డకు జన్మనిచ్చే ఉద్యోగికి 90,000 యువాన్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం పదకొండున్నర లక్షల రూపాయలు. అంతేకాకుండా మహిళా ఉద్యోగికైతే ఏడాది జీతంతో కూడిన సెలవు, అదే పురుష ఉద్యోగికైతే 9 నెలలు జీతంలో కూడిన సెలవు ఇస్తామని ప్రకటించింది. ఇక రెండో బిడ్డను కన్నవారికైతే 7 లక్షల రూపాయలు, మొదటి బిడ్డను కన్నవారికైతే మూడున్నర లక్షల రూపాయలు ఆఫర్ చేస్తోంది. అలా దేశ జనాభాను పంచేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు చెబుతోంది.