ChatGPT: చాట్‌జీపీటీ సర్వర్‌ డౌన్.. సేవల్లో అంతరాయం.. సోషల్‌ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ!

ప్రముఖ ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా భారత్‌ సహా అనే దేశాల్లో ఉన్న లక్షలాది మంది వినియోగదారులు చాట్‌జీపీటిని ప్రస్తుతం యాక్సెస్‌ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే కేవలం భారతీయ వినియోగదారుల నుంచే 500 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చిటనట్టు తెలుస్తోంది.

ChatGPT: చాట్‌జీపీటీ సర్వర్‌ డౌన్.. సేవల్లో అంతరాయం.. సోషల్‌ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ!
Chatgpt

Updated on: Sep 03, 2025 | 2:42 PM

ప్రముఖ ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా భారత్‌ సహా అనే దేశాల్లో ఉన్న లక్షలాది మంది వినియోగదారులు చాట్‌జీపీటి ప్రస్తుతం యాక్సెస్‌ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు గత అరగంటలో ఈ ఫిర్యాదులు సంఖ్య బారీగా పెరిగింది. డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం నుంచి చాట్‌జీపీటీలో ఈ అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం భారత్‌ నుంచే దాదాపు 500కిపైగా ఫిర్యాదులు సోషల్‌ మీడియాలో నమొదైనట్టు పేర్కొంది.

చాలా మంది యూజర్లు మొబైల్‌ యాప్‌, కంప్యూటర్స్‌ రెండింటిలోనూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు వినియోగదారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరికి అస్సలు స్క్రీన్‌ ఓపెన్‌ కావట్లేదని, మరికొందరికి ఎర్రర్‌ వస్తుందని, మరికొందరు అడిగిన ప్రశ్నలకు స్పందించట్లేదని పేర్కొంటున్నారు. అంతేకాదు కొందరు లాగిన్‌, నెట్‌వర్క్‌ ఎర్రర్‌, వంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు.

మరోవైపు చాట్‌జీపీటి సేవల్లో అంతరాయం ఏర్పడడంతో దీన్ని యూజర్లు ఎక్స్‌తో హైలెట్‌ చేస్తున్నారు. ‘చాట్‌ జీపీటీ డౌన్‌’ అంటూ యూజర్లు హ్యాష్ ట్యాగ్స్‌తో ట్రెండ్‌లోకి తెస్తున్నారు. అయితే ఈ అంతరాయంపై ఓపెన్ ఏఐ సంస్థ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.