Chandrayaan 2: చంద్రుడికీ భారత్ అంటే ఇష్టం లేదు.. పాకీయుల వెకిలి ట్వీట్లు

| Edited By:

Sep 14, 2019 | 9:37 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రయోగంకు చివరి దశలో అంతరాయం కలిగింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీ దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ నుంచి కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి లోనయ్యారు. ఛైర్మన్ శివన్ సహా అందరు శాస్త్రవేత్తలు ఉద్వేగానికి గురయ్యారు. దీంతో ప్రధాని మోదీ వారికి ధైర్యం చెప్పారు. మరోవైపు పలువురు ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. ఇస్రో శాస్త్రవేత్తలు […]

Chandrayaan 2: చంద్రుడికీ భారత్ అంటే ఇష్టం లేదు.. పాకీయుల వెకిలి ట్వీట్లు
Follow us on

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రయోగంకు చివరి దశలో అంతరాయం కలిగింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీ దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ నుంచి కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి లోనయ్యారు. ఛైర్మన్ శివన్ సహా అందరు శాస్త్రవేత్తలు ఉద్వేగానికి గురయ్యారు. దీంతో ప్రధాని మోదీ వారికి ధైర్యం చెప్పారు. మరోవైపు పలువురు ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే గొప్ప విజయం సాధించారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇక ఇదే అదనుగా భావించిన పాక్ దేశీయులు సోషల్ మీడియాలో తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. పాక్ దేశానికి చెందిన అధికారులతో పాటు అక్కడి నెటిజన్లు కూడా ఈ ప్రయోగంపై వెకిలి ట్వీట్లు చేస్తున్నారు. ‘‘ఇండియా ఫెయిల్’’ అని కామెంట్లు పెడుతున్నారు. భారత్ తన మీదికి రావడం చంద్రుడికి కూడా ఇష్టం లేదని మీమ్స్‌తో ట్వీట్లు చేస్తున్నారు. వీటికి భారత నెటిజన్లు కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. ‘‘మేము అంతవరకు అయినా వెళ్లగలిగాం. మీలాగా ప్రతి విషయానికి దాయాది దేశం మీద పడి ఏడవట్లేదు’’ అని గట్టిగా కామెంట్లు పెడుతున్నారు.