
ఇరాన్‌పై ఇజ్రాయెల్, ఆమెరికా చేసిన సంయుక్త దాడులతో పచ్చిమాసియా మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాల దాడితో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ఏకంగా ఒకే సారి అమెరికా, ఇజ్రాయెల్ సమా 10 దేశాలపై బాలిస్టన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ క్రమంలో దూబయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తమైన భవనం సమీపంలో డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో డ్రోన్‌లు బుర్జ్ ఖలీఫాన్ ఢీకొట్టాయని ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియోలో బుర్జ్ ఖలీఫా సమీపంలో నుంచి ఇరానియన్ డ్రోన్ వెళ్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అలాగే వీడియో బుర్జు ఖలీఫా సమీపంలో నల్లటి పొగ ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది దుబాయ్‌లోని ఐకానిక్ టవర్ అయిన బుర్జు ఖలీఫా దాడికి గురైందని అనుకుంటున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు బుర్జ్ ఖలీఫాపై ఎలాంటి దాడి జరినట్టు అధికారులు పేర్కొనలేదు.
వీడియో చూడండి..
JUST IN: 🇮🇷🇦🇪 Footage shows another Iranian drone striking close to Burj Khalifa, the tallest building in the world, in Dubai, UAE. pic.twitter.com/zB9cAdYpYU
— BRICS News (@BRICSinfo) February 28, 2026
అయితే ఈ వీడియో బయటకు వచ్చే ముందే అనేక ఇరానియన్ డ్రోన్‌లు దుబాయ్‌లోని పలు నగాల్లోకి దూసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైమానికి దళాలు, ప్రభుత్వాలు జనాలకు హెచ్చరికలు జారీ చేశాయి. స్థానికంగా ఉన్న కొన్ని భవనాలను ఖాళీ చేయించాయి.
ఇక దుబాయ్ నడిబొడ్డున 828 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బుర్జ్ ఖలీఫా విలువ 1.5 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా ఉంది. ఇది దుబాయ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ టవర్ దాని ప్రధాన నిర్మాణాన్ని కవర్ చేసే దాని డెవలపర్ ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం దాదాపు $1.5 బిలియన్లకు ఇన్‌సూరెన్స్ చేయబడింది.
🚨 WATCH: Footage shows an Iranian drone being intercepted right near the Burj Khalifa in Dubai.
— Breaking911 (@Breaking911) March 1, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.