ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి..?

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ  చైర్మన్, 38 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీకి లిచ్టెన్‌స్టెయిన్ రాజధాని వాడుజ్ లో పెళ్లి నిశ్చయమైందని, ఈ ఏడాది చివర్లో వివాహం జరగవచ్చని ప్రచారం సాగుతోంది. ఆస్ట్రియాకు చెందిన రాజకుటుంబీకురాలు 26 ఏళ్ల గ్లోరియా వాన్ హాబ్స్‌బర్గ్ తో బిలావల్ వివాహం జరగబోతోందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. 

ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి..?
Bilawal Bhutto To Marry European Princess

Updated on: Aug 31, 2026 | 8:18 PM

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ త్వరలో పెళ్లిపీటలెక్కిబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆస్ట్రియా చివరి చక్రవర్తి చార్లెస్-1 మునిమనవరాలిని ఆయన వివాహం చేసుకోనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బిలావల్ తండ్రి, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఏడు రోజుల ప్రైవేట్ పర్యటనపై యూరప్‌కు వెళ్లడంతో ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తన కుమారుడు బిలావల్ భుట్టో వివాహ నిశ్చితార్థం, పెళ్లి తేదీని ఖరారు చేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి లిచ్టెన్‌స్టీన్ పర్యటనకు వెళ్లారని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ  చైర్మన్, 38 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీకి లిచ్టెన్‌స్టెయిన్ రాజధాని వాడుజ్ లో పెళ్లి నిశ్చయమైందని, ఈ ఏడాది చివర్లో వివాహం జరగవచ్చని ప్రచారం సాగుతోంది. ఆస్ట్రియాకు చెందిన రాజకుటుంబీకురాలు 26 ఏళ్ల గ్లోరియా వాన్ హాబ్స్‌బర్గ్ తో బిలావల్ వివాహం జరగబోతోందని నెట్టింట వార్తలు వస్తున్నాయి.

ఆసిఫ్ అలీ జర్దారీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లినట్లు ఆగస్టు 27న పాకిస్థాన్ అధ్యక్ష కార్యాలయం ఒక  ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయన ఎక్కడికి, ఏ పనిపై వెళ్లారనే వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. జర్దారీ విదేశీ పర్యటనను, బిలావల్ పెళ్లి ఏర్పాట్లతో ముడిపెడుతూ పాక్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. ఈ వదంతులను పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) సీనియర్ నేత, కరాచీ మేయర్ ముర్తాజా వాహబ్ పూర్తిగా తోసిపుచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు.  పెళ్లి వార్తలపై జర్దారీ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

గ్లోరియా వాన్ హ్యాబ్స్‌బర్గ్.. ఆస్ట్రియా ఆర్చ్‌డ్యూక్ కార్ల్,  ఫ్రాన్సెస్కా వాన్ థైసెన్-బోర్నెమిస్జా దంపతుల కుమార్తె. ఈమె హ్యాబ్స్‌బర్గ్-లోరైన్ రాజవంశానికి చెందినవారు కాగా, ఆస్ట్రియా చివరి చక్రవర్తి , హంగేరీ చివరి రాజు అయిన కార్ల్-1కి మునిమనవరాలు.

Loading...
Unable to load recommendations.
Follow Us