Green Card Update: గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. DHS తాజా ప్రకటన వైరల్

Green Card News 2026: అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి DHS భారీ ఊరట ఇచ్చింది. ఎక్కువ మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు పరిశీలనలో ఉన్న సమయంలో అమెరికాలోనే ఉండవచ్చని స్పష్టంచేసింది. USCIS ప్రకటనపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది.

Green Card Update: గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. DHS తాజా ప్రకటన వైరల్
DHS Green Card Update

Updated on: May 31, 2026 | 9:49 AM

అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు కాస్త ఊరట లభించింది. అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇటీవల అమెరికా పౌరసత్వ, వలస సేవలు (USCIS) విడుదల చేసిన ప్రకటనతో వలసదారుల్లో అయోమయం నెలకొంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన వారు సాధారణంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లి, అక్కడి నుంచే ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి వస్తుందని, ప్రత్యేక పరిస్థితులు ఉన్నవారికి మాత్రమే మినహాయింపులు ఉంటాయని ఆ ప్రకటన ద్వారా పేర్కొంది.

అయితే, ఈ అంశంపై DHS శుక్రవారం స్పష్టత ఇచ్చింది. గ్రీన్ కార్డ్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులు అమెరికాలోనే ఉండాలా లేదా విదేశాల్లో వేచి ఉండాలా అనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇప్పటికే కేసు వారీగా నిర్ణయించే అధికారం కలిగి ఉన్నారని తెలిపింది.

DHS ప్రతినిధి మాట్లాడుతూ, తాజాగా విడుదలైన మార్గదర్శకాలు కొత్త నిబంధనలు కావని, ఇప్పటికే అమల్లో ఉన్న అధికారాలను గుర్తు చేయడమేనని పేర్కొన్నారు. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది వ్యక్తులు తమ కేసులు పరిశీలనలో ఉన్న సమయంలో అమెరికాలోనే కొనసాగేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే వీసా గడువు మించి అమెరికాలో ఉండటం, ఇతర ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు వంటి అంశాలు కొన్ని వ్యక్తిగత కేసుల్లో ప్రభావం చూపవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఎవరిపై ఈ నిబంధనలు వర్తిస్తాయనే దానిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

గత వారం వెలువడిన ప్రకటన కారణంగా వలసదారులు, వలస హక్కుల కోసం పనిచేసే సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతేకాకుండా, ఆ మార్గదర్శకాల పరిధి ఏమిటన్న విషయంపై శాఖలోని కొందరు అధికారులు కూడా స్పష్టత లేనట్టుగా సమాచారం వెలువడింది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, వైట్ హౌస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ పరిణామాన్ని సాధారణ పరిపాలనా చర్యగా అభివర్ణించారు. ఇది అమెరికా వలస విధానంలో పెద్ద మార్పు కాదని ఆయన పేర్కొన్నారు.

అయితే గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఎలాంటి పరిస్థితుల్లో దరఖాస్తుదారులు అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుందనే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రస్తుతం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అత్యధిక మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉండవచ్చని DHS సంకేతాలు ఇచ్చింది. దీంతో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది భారతీయులకు కూడా పెద్ద ఊరట లభించినట్లయింది.

Follow Us