
ఆర్టెమిస్ .. ఈ పేరే ఎందుకు పెట్టారు. గ్రీకు పురాణాల ప్రకారం.. ఆర్టిమిస్ అనే దేవత చంద్రుడికి అధిదేవత. సూర్యుడికి అధిదేవత అయిన అపోలోకి కవల సోదరి. నాసా చంద్రుడి మీదకు మనుషులను పంపిన మొదటి ప్రాజెక్టుకు పెట్టిన పేరు ‘అపోలో’నే. సో, అపోలో సోదరి ఆర్టెమిస్ కాబట్టి.. దానికి కొనసాగింపుగా అన్నట్టుగా ఉండాలనే ఈ పేరు. ఇక అసలు విషయం. చంద్రుని మీద కాలుమోపడానికి పెద్ద కసరత్తు అక్కర్లేదు. నాసాకు ఆల్రడీ అనుభవం ఉంది. బట్.. ఈ ఆర్టెమిస్ మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగడానికి. మనం రోజూ చూస్తున్న చంద్రుని ముఖం ఉత్తర దిశది. ఆ వెనక దక్షిణాన అంతా చీకటే. అక్కడ ఏముందో, ఎలా ఉంటుందో తెలియదు మనిషికి. బట్.. ఆ దక్షిణ ధ్రువంలో భూకంపాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అంతేకాదు.. అక్కడి వాలు ప్రాంతాలు వదులుగా ఉండి, జారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు గుర్తించారు. ల్యాండింగ్ సమయంలో స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు వచ్చే అవకాశమూ ఉందంటున్నారు. వీటన్నింటికంటే అసలైన సవాలు.. కమ్యూనికేషన్. చంద్రుని వెనక నుంచి భూమి మీదకు కమ్యూనికేట్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే.. ఆర్టెమిస్ మిషన్‌లో నాలుగు దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. 1972.. మనిషి చివరిసారిగా...