Viral News: బొమ్మ గన్ తో దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చాడు.. క‌ట్ చేస్తే ఊహించ‌ని ట్విస్ట్

బ్రిటన్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లోకి ఓ దొంగ జొరబడ్డాడు. తుపాకీ చూపి మేనేజర్ ను బెదరించి ఆరు వందల పౌండ్లు....

Viral News:  బొమ్మ గన్ తో దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చాడు.. క‌ట్ చేస్తే ఊహించ‌ని ట్విస్ట్
Fake Gun Theft

Updated on: May 01, 2021 | 3:59 PM

బ్రిటన్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లోకి ఓ దొంగ జొరబడ్డాడు. తుపాకీ చూపి మేనేజర్ ను బెదరించి ఆరు వందల పౌండ్లు తీసుకున్నాడు. దాంతో వెళ్లిపోయాడా అంటే లేదు. ఆకలిగా ఉందో ఏమో.. మేనేజర్‌ను మరోసారి తుపాకీతో బెదిరించి ఫేమస్‌ డిష్‌ చికెన్ నగెట్స్ కావాలని డిమాండ్ చేశాడు. ఉదయం 7 గంటలకు చికెన్ నగెట్స్ ఎలా ఉంటాయి.. ఆ డిష్ లంచ్ మెనూలో ఉందని మేనేజర్ చెప్పాడు. మధ్యాహ్నం దాకా ఉండడం కుదరదు కదా.. అందుకే డబుల్ సాసేజ్ మెక్‌మఫిన్ తో దొంగ సరిపెట్టుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారమంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది మెక్‌డొనాల్డ్స్ మేనేజర్ ఆ వీడియోను ట్విట్టర్ లో ఉంచితే అది కాస్తా వైరల్ అయింది. నెటిజనులు రకరకాల కామెంట్లు పెట్టారు.

అప్పు తీర్చడం కోసం దొంగతనం చేసానని పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే అతను ఉపయోగించిన గన్‌ బొమ్మ గన్‌ అని తర్వాత తెలిసింది. దొంగకు ఆరేళ్ళ జైలు విధించారు జడ్జి.

Also Read: మే 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ పోస్ట్.. అసలు నిజమిదే.!

మొద‌ట న‌మ్మించారు.. ఆ త‌ర్వాత న‌ట్టేట ముంచారు.. లక్కీ లాటరీ పేరుతో బురిడీ..

Loading...
Unable to load recommendations.
Follow Us