
చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలంటుంటారు. అంటే ఒక్కోసారి సమస్య చిన్నగా కనిపించినా ప్రమాదం తీవ్రత అధికంగా ఉండవచ్చని అర్థం. అందుకే ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలి. అందుకే పాము చిన్నదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఓ 11 ఏళ్ల బాలిక ఓ చిన్న పామును చేత్తో పట్టుకుంది. అది అటూ ఇటూ కదులుతుంటే ఎంజాయ్ చేసింది. అయితే అది అత్యంత విషపూరితమైనదని తెలుసుకొని ఒక్కసారిగా అవాక్కైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ బాలిక తన గ్రాండ్ పేరెంట్స్‌తో బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు గోధుమ రంగులలో ఉండే ఒక చిన్న పాము కనిపించింది. వెంటనే ఆమె పామును తన చేతుల్లోకి తీసుకుంది. ఆ పాము తన అరచేతిలో అటు ఇటూ కదులుతూ ఉంది. పామును వదిలేయమని తన కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పినా ఆమె పట్టించుకోలేదు.
అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను సెల్‌ఫోన్ తో వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. దీనిపై ఓ స్నేక్ క్యాచర్ స్పందించాడు. ఆ పాము అత్యంత విషపూరితమైనదని తెలిపాడు. పాము విషయంలో చిన్నారి ఎంతో అదృష్టవంతురాలని, పొరపాటును ఆ పాము కాటు వేసి ఉంటే ఆమె స్పాట్‌లో చనిపోయి ఉండేదని తెలిపాడు. దీంతో, చిన్నారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు.
? @7NewsAustralia || Little girl picks up deadly eastern brown snake in Melbourne’s southwest in alarming video.
She told the video she had found a garter snake, which are harmless and native to north and central America.https://t.co/hUXYKkeyzG pic.twitter.com/K1sl454PTV
— PiQ (@PriapusIQ) October 22, 2022
కాగా.. ఈ పాముల కారణంగానే ఆస్ట్రేలియాలో అధిక మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. చిన్నారి ఎంతో లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని కామెంట్లు చేస్తున్నారు.