కోటి రూపాయల కట్నమిచ్చినా.. ఉసురు తీశారు

వరకట్నం వేధింపులకు మరో ఇల్లాలు బలైంది. ఎన్నారై భర్త అని ఆశపడి పెళ్లి చేసుకుంటే.. వరకట్నం వేధింపులతో ఆమె ఉసురు తీశారు అత్తింటి వారు. హైదరాబాద్ రామంతపూర్‌కు చెందిన జువాడి శ్రీలత.. వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ముంబైలోని తన మేనమామ ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామాంతపూర్‌కు చెందిన శ్రీలతకు, యూకేలో ఉంటోన్న వంశీరావుతో 2011లో వివాహం జరిగింది. ఆ సమయంలో కట్నం కింద కోటి రూపాయలు, 55 తులాల బంగారాన్ని శ్రీలత […]

కోటి రూపాయల కట్నమిచ్చినా.. ఉసురు తీశారు
Follow us

| Edited By:

Updated on: May 08, 2019 | 1:17 PM

వరకట్నం వేధింపులకు మరో ఇల్లాలు బలైంది. ఎన్నారై భర్త అని ఆశపడి పెళ్లి చేసుకుంటే.. వరకట్నం వేధింపులతో ఆమె ఉసురు తీశారు అత్తింటి వారు. హైదరాబాద్ రామంతపూర్‌కు చెందిన జువాడి శ్రీలత.. వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ముంబైలోని తన మేనమామ ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామాంతపూర్‌కు చెందిన శ్రీలతకు, యూకేలో ఉంటోన్న వంశీరావుతో 2011లో వివాహం జరిగింది. ఆ సమయంలో కట్నం కింద కోటి రూపాయలు, 55 తులాల బంగారాన్ని శ్రీలత తల్లిదండ్రులు ఇచ్చారు. 2012లో వంశీ, శ్రీలతను యూకేకు తీసుకెళ్లగా.. అక్కడ ఈ ఇద్దరు సాఫ్ట్‌వేర్ జాబ్‌లు చేస్తూ వచ్చారు. కొద్దిరోజులు వీరి కాపురం సజావుగా సాగినా.. ఆ తరువాత కట్నం వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శ్రీలత పాపకు జన్మనివ్వగా.. అప్పటినుంచి అత్తింటివారు ఆమెను మరింతగా వేధిస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో 2018లో యూకేలో ట్రైన్ దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది శ్రీలత. అయినా వంశీరావులో మార్పు రాలేదు. కాగా 2018 జూన్‌లో యూకే నుంచి శ్రీలత, భర్త వంశీరావు, పాపతో హైదరాబాద్‌‌కు వచ్చారు. అయితే శ్రీలత, పాపను ఇక్కడే వదిలేసి, వంశీరావు యూకేకు తిరిగి వెళ్లిపోయాడు. ఇక ఇక్కడే అత్తింట్లో ఉన్న శ్రీలతకు వారి వద్ద నుంచి రోజూ వేధింపులు ఉండటంతో.. ముంబైలోని తన మేనమామ ఇంటికి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

మరోవైపు శ్రీలతను పొట్టనబెట్టుకున్న భర్త వంశీరావు, అత్తామామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వారి ఇంటి ముందు ఐద్వా మహిళా సంఘం నేతలు ఆందోళనకు దిగారు. శ్రీలత పాపకు న్యాయం జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మాట్లాడిన మల్కాజ్‌గిరి ఏసీపీ సందీప్ రావు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శ్రీలత ఆత్మహత్య తరువాత ఇంటికి తాళం వేసి ఆమె అత్తామామలు పరారయ్యారని, వారి కోసం గాలింపు చేపట్టామని పేర్కొన్నారు.

Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.