‘ మా వాడికి నోబెల్ వచ్చిందా ? నాకు చెప్పనే లేదే ? ‘.. అభిజిత్ తల్లి

తన కుమారుడు అభిజిత్ బెనర్జీకి నోబెల్ అవార్డు లభించిన విషయం ఆయన తల్లి నిర్మలా బెనర్జీకి తెలియనేలేదట. ఈ వండర్ ఫుల్ న్యూస్ ని తన కొడుకు తనకు చెప్పనేలేదని ఆమె సుతారంగా విసుక్కుంది. ‘ నేను గత రాత్రే అతనితో మాట్లాడాను. అప్పుడు ఈ విషయం చెప్పలేదు. నాకు చెప్పి ఉండొచ్ఛుగా ! అని నిలదీస్తాను ‘ అని సంతోషంతో ఉప్పొంగిపోతున్న నిర్మల బెనర్జీ అన్నారు. అభిజిత్ కి ఈ అవార్డు రావడం తనకు గర్వ […]

' మా వాడికి నోబెల్ వచ్చిందా ? నాకు చెప్పనే లేదే ? '.. అభిజిత్ తల్లి
Follow us

| Edited By:

Updated on: Oct 15, 2019 | 1:49 PM

తన కుమారుడు అభిజిత్ బెనర్జీకి నోబెల్ అవార్డు లభించిన విషయం ఆయన తల్లి నిర్మలా బెనర్జీకి తెలియనేలేదట. ఈ వండర్ ఫుల్ న్యూస్ ని తన కొడుకు తనకు చెప్పనేలేదని ఆమె సుతారంగా విసుక్కుంది. ‘ నేను గత రాత్రే అతనితో మాట్లాడాను. అప్పుడు ఈ విషయం చెప్పలేదు. నాకు చెప్పి ఉండొచ్ఛుగా ! అని నిలదీస్తాను ‘ అని సంతోషంతో ఉప్పొంగిపోతున్న నిర్మల బెనర్జీ అన్నారు. అభిజిత్ కి ఈ అవార్డు రావడం తనకు గర్వ కారణమన్నారు. అన్నట్టు ఈమె కూడా ఆర్థికవేత్తే. పేదరికంపై తన కొడుకు జరుపుతున్న అధ్యయనం, పేదరిక నిర్మూలనకు ఎలాంటి పబ్లిక్ పాలసీని రూపొందించాలో అన్న అంశాలపై తాము తరచూ మాట్లాడుకునేవారమని ఆమె తెలిపారు. థియోరిటికల్ వర్క్ కి, ఎకనమిక్స్ కి సంబంధం లేదని అభిజిత్ అప్పుడప్పుడూ అంటుండేవాడని, పేదరిక నిర్మూలన పైనే ఎక్కువగా దృష్టి పెట్టేవాడని ఆమె చెప్పారు. ఈ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం గురించిన ప్రస్తావన కూడా మా చర్చల్లో వచ్ఛేదన్నారు. ఆ దంపతులిద్దరూ (అభిజిత్, ఆయన భార్య ఎస్తేర్ డుఫ్లో) ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాల్లో పని చేసేవారని, ఎస్తేర్ అయితే ఇండోనేసియాలో కూడా పని చేసిందని నిర్మల బెనర్జీ తెలిపారు. ఆ దేశాల్లోని పేదరికంపై ఇద్దరూ ఎంతో అధ్యయనం చేశారన్నారు. పావర్టీ, స్థానిక ఆర్ధిక సంక్షోభాలు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాయన్న దానిపై వారిద్దరూ యోచించేవారన్నారు. 2017 లో తన కుమారుడు అమెరికన్ పౌరసత్వాన్ని అంగీకరించినప్పటికీ, అతని హృదయం భారత దేశంలోనే ఉందని నిర్మల బెనర్జీ పేర్కొన్నారు. ఎలాగైనా అతడు భారతీయుడే అన్నారు.’ చిన్నతనంలో అభిజిత్ పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు.. క్రీడలు, రచనా వ్యాసంగంలోనూ దిట్టే ‘అని ఆమె చెప్పారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు