మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు మిస్.. సీక్రెట్ ఏమిటి.?

Sahoo New Poster, మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు మిస్.. సీక్రెట్ ఏమిటి.?

‘డార్లింగ్’ ప్రభాస్ నుంచి ‘సాహో’ అప్డేట్ బయటికి వచ్చింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు మరో కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు ప్రభాస్. ఇకపోతే సినిమాకు అత్యంత కీలకమైన మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు మాత్రం రిలీజైన ఫస్ట్ లుక్‌లో లేకపోవడంతో ఫ్యాన్స్‌లో సందేహం తలెత్తింది.

ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్- ఎహసాన్- లోయ్‌లు సంగీతం అందిస్తున్నారు. ఇక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ‘సాహో’ టీజర్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించింది ఎస్.ఎస్.థమన్. ఇక దీనితో అనుమానాలు తలెత్తి చిత్ర నిర్మాతలను అడగగా ‘ఈ చిత్రానికి సంగీతం అందించేది శంకర్- ఎహసాన్- లోయ్‌లే అని స్పష్టం చేశారు’.

మరోవైపు ఇటీవల రిలీజైన ‘షేడ్స్ అఫ్ సాహో’ వీడియోలకు కూడా శంకర్- ఎహసాన్- లోయ్‌లే సంగీతం అందించారు. అయితే ఈరోజు విడుదలైన పోస్టర్‌లో మాత్రం వీరి పేర్లు కనిపించలేదు. ఏదైనా చిన్న పొరపాటు వల్ల వీళ్ళ పేర్లు కనిపించలేదా.? లేక అంతకు మించి ఏదైనా జరిగిందా.? అనే అనుమానం అభిమానుల్లో తలెత్తింది. చూడాలి మరి ఈ ప్రశ్నకు ‘డార్లింగ్’ ప్రభాస్ లేదా చిత్ర యూనిట్ ఏ సమాధానం చెబుతారో చూడాలి.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *