‘మోదీజీ ! చైనా మిమ్మల్ని ప్రశంసిస్తోందేమిటి..? రాహుల్ గాంధీ సూటి ప్రశ్న .

లదా ఖ్ లో భారత-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగి మన సైనికులు 20 మంది మరణిస్తే.. ప్రధాని మోదీని చైనా ఎందుకు ప్రశంసిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీని 'సరెండర్ మోదీ' గా ఆయన అభివర్ణించారు. చైనా మన భూభాగాలను..

'మోదీజీ ! చైనా మిమ్మల్ని ప్రశంసిస్తోందేమిటి..? రాహుల్ గాంధీ సూటి ప్రశ్న .
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 22, 2020 | 7:51 PM

లదా ఖ్ లో భారత-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగి మన సైనికులు 20 మంది మరణిస్తే.. ప్రధాని మోదీని చైనా ఎందుకు ప్రశంసిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీని ‘సరెండర్ మోదీ’ గా ఆయన అభివర్ణించారు. చైనా మన భూభాగాలను ఆక్రమించుకోలేదని, సరిహద్దులు కూడా దాటలేదని మోదీ ఇటీవల అఖిల పక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలను రాహుల్ గుర్తు చేస్తూ.. భారత భూభాగాలను ఆయన చైనాకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.’ చైనా వారు మన సైనికులను హతమార్చారు.. మన భూభాగాలను చేజిక్కించుకున్నారు.. కానీ ఆ దేశం ఈ  ప్రధానిని ఎందుకు కొనియాడుతోంది’ అన్నారాయన.

‘చైనాతో యుధ్ధం చేయలేమని ఇండియాకు తెలుసు’ అన్న శీర్షికతో ఓ ఆర్టికల్ చైనా అధికార మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ లో ప్రచురితమైంది. సైనిక పరంగానే కాక.. అంతర్జాతీయంగా అన్ని విధాలా ఇండియా కన్నా చైనా సుపీరియర్’ అన్న వాక్యాలను కూడా ఈ ఆర్టికల్ లో చేర్చారు. గాల్వన్ వ్యాలీలో  ఈ నెల 15 న భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో.. రాహుల్.. మోదీని టార్గెట్ చేస్తూ.. ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. నరేంద్ర మోదీ నిజంగా ‘సరెండర్'(లొంగిపోయిన) మోదీ’ అని అయన ఓ వ్యాసంలో దుయ్యబట్టారు.. తాజాగా.. చైనా పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ లో వచ్చిన వార్తను ఆయన ట్వీట్ కి జత చేశారు.