Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

‘ఢీ’ కి ప్రదీప్ రీ ఎంట్రీ.. రీజన్ ఇదే..!

Dhee Champions Anchor Pradeep Re-Entry Update, ‘ఢీ’ కి ప్రదీప్ రీ ఎంట్రీ.. రీజన్ ఇదే..!

ప్రముఖ టెలివిజన్ డ్యాన్స్ షో ‘ఢీ’ నుంచి యాంకర్ ప్రదీప్ అనూహ్యంగా మిస్ అయ్యాడు. దీంతో అతను లేని ఫీలింగ్ షో రేటింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. చాలా మంది ప్రదీప్ ఏమయ్యాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఇది అడ్వాంటేజ్ తీసుకున్న కొంతమంది ఢీ నుంచి ప్రదీప్ మానేశాడని, మరికొందరు అతను తీవ్ర అనారోగ్యానికి పుకార్లు సృష్టించారు. అసలు విషయం ఏంటనేది క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌కు  జడ్జ్ నాగబాబు సహా కొన్ని గ్యాంగ్‌లు గుడ్ బై చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ కూడా ఆ బ్యాచ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. రెండు ప్రొగ్రామ్స్‌ను ఆర్గనైజ్ చేసేది మల్లెమాల సంస్థ కావడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం లభించింది. వీడియో బైట్ రిలీజ్ చేసిన ప్రదీప్ వాటిని ఖండించినప్పటికి రూమర్స్ మాత్రం ఆగలేదు.

ఇలా ఉండగానే ప్రదీప్ హైపర్ ఆదితో కలిసి ఢీకి మరోసారి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. దీనిపై స్పష్టత తీసుకునేందుకు టీవీ9 ఎంటర్టైన్మెంట్ టీం ప్రయత్నించింది. నిజానికి ప్రదీప్ కాలికి గాయం వల్ల సర్జరీ చేయించుకోవడంతోనే అతను షోకి దూరమయ్యాడట. అయితే ప్రదీప్‌ మొదట్లోనే మల్లెమాల, ఈటీవీలతో పాటు బయట కూడా షోస్ చేసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అందుకే అతను జీ తెలుగులో పలు షోస్‌కి , కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా కనిపించాడు. అందుకే అతను జీ తెలుగులో కొత్త షో చేస్తున్నా కూడా మల్లెమాల కానీ, ఈటీవీ గానీ ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. దీంతో అతను సర్జరీ తర్వాత రెస్ట్ అయిపోయిన అనంతరం మళ్లీ ఎప్పట్లానే వ్యాఖ్యాతగా కంటిన్యూ అవుతున్నాడు. సో ఇదన్నమాట ప్రదీప్ రీ ఎంట్రీ వెనకున్న సంగతి.