ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు వెలవెలబోతున్న సింగూరు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. వరుణుడు జాడ లేకపోవడంతో జలశయాలు మైదానాలుగా మారుతున్నాయి. మంజీర నదిలో ప్రవాహం లేక.. కీలక ప్రాజెక్ట్‌లు ఎండిపోతున్నారు. హైదరాబాద్‌కు తాగునీరు.. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే సింగూర్ జలాశయం నీళ్లు లేక వెలవెలబోతుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. […]

ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు వెలవెలబోతున్న సింగూరు
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 8:37 AM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. వరుణుడు జాడ లేకపోవడంతో జలశయాలు మైదానాలుగా మారుతున్నాయి. మంజీర నదిలో ప్రవాహం లేక.. కీలక ప్రాజెక్ట్‌లు ఎండిపోతున్నారు. హైదరాబాద్‌కు తాగునీరు.. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే సింగూర్ జలాశయం నీళ్లు లేక వెలవెలబోతుంది.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా జిల్లాల్లోని వాగులు పొంగిపొర్లడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడక్కడ పంట పొలాలు నీటమునిగాయి. పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోగా, మరికొన్నిచోట్ల పాక్షికంగా దెబ్బతిన్నాయి. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.