ఏమిటా వింత జీవి ? ఏలియన్ లా ఉందే !

what on earth is that.. bizarre alien like wingled creature found in indonesia, ఏమిటా వింత జీవి ? ఏలియన్ లా ఉందే !

ఇండోనేసియాలో ఓ వ్యక్తి తన ఇంటి సీలింగ్ పై ఓ వింత ప్రాణిని చూసి ఆశ్చర్యపోయాడు. రెండు రెక్కలు, నాలుగు టెంటకిల్స్ , పొడవైన కాళ్లతో కూడిన ఈ ప్రాణి..అతికష్టం మీద సీలింగ్ లోని అవతలి భాగానికి కదులుతున్నటుగా కనిపించింది. వర్షం కురిసిన రాత్రి తేమతో కూడిన ఇంటి పై కప్పు మీద ఇది కదలాడడాన్ని తన ఇంటివారికి, బంధువులకు కూడా చూపాడాయన. చూడబోతే ఇది చిన్న సైజు ఏలియన్ లా ఉందే అంటూ తనకు తానే చమత్కరించుకున్నాడు. అయితే విచిత్రమైన, అరుదైన ఈ ప్రాణి క్రెటోనోటస్ గంగీస్ అనే జాతికి చెందిన కీటకమని ‘ కీటక నిపుణులు ‘ అంటున్నారు. సాధారణంగా ఇలాంటివి ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా దేశంలో కనిపిస్తాయట.. తమ జాతి కీటకాలను ఆకర్షించడానికి అవి తమ కాళ్ళను పైకీ, కిందికీ కదిలిస్తుంటాయని, వాటికి వాసనతో కూడిన ‘ సెంట్ ‘ ఉంటుందని ఈ పరిశోధకులు చెబుతున్నారు. 2017 లో ఇలాంటి జీవే ఆస్ట్రేలియాలో కనబడినట్టు వారు పేర్కొన్నారు. ఏమైనా ఇలాంటి వింత ప్రాణి తాలూకు వీడియో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *