సర్ఫర్‌ స్పీడ్‌.. ఖంగుతిన్న షార్క్‌.

Drone pilot saves surfer from shark with speakers, సర్ఫర్‌ స్పీడ్‌.. ఖంగుతిన్న షార్క్‌.

సముద్రంలో షార్క్‌స్పీడ్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే..మనిషి సహా.. దాని ఫుడ్ ఏదైనా సరే..కంట పడిందా..అంతే,.. రెప్పపాటులో ఇట్టేపట్టేస్తుంది. అయితే, ఇక్కడ మాత్రం ఓ షార్క్‌ సర్ఫింగ్‌ చేస్తున్న వ్యక్తిని చూసి తోకముడిచింది. అందేంటో తెలిస్తే..మీరూ ఆశ్చర్యపోతారు..ఇంతకీ అదేలా సాధ్యమైందో తెలుసా..
ఆస్ట్రేలియన్‌ ఫైనాన్షియల్‌ రివ్యూకు సహాయక సంపాదకుడు క్రిస్టోఫర్‌ జాయిస్‌ అనే పరిశోధకుడు సరదాగా ప్రమాదకర ఫీట్లు చేస్తూ సొరచేపల కదలికలను చిత్రీకరిస్తుంటాడు.  ఈ క్రమంలో న్యూసౌత్‌ వేల్లోస్‌లో సముద్రంలో షూట్‌ చేస్తున్నాడు. అదే సమయంలో మరో వ్యక్తి అక్కడ సర్ఫింగ్‌ చేస్తూ కనిపించాడు.. ఇంతలో ఆయన వైపు  ఓ సొరచేప వేగంగా దూసుకొచ్చింది. డ్రోన్‌ ఆపరేటర్‌ చేస్తున్న క్రిస్టఫర్‌ వెంటనే తన మావిక్  స్పీకర్ ద్వారా ఆ సర్ఫర్‌ను హెచ్చరించాడు. షార్క్‌..షార్క్‌..షార్క్‌ అనే హెచ్చరికల శబ్దాన్ని విన్న సర్పర్‌, షార్క్‌ను గమనించి వేగంగా  వెనుదిరిగాడు.. అయితే సర్పర్‌ వేగాన్ని చూసి షార్క్‌ కూడా భయంతో దూరంగా వెళ్లిపోయింది. క్రిస్టఫర్‌ హెచ్చరిక ఆ సర్ఫర్‌ ప్రాణాలు కాపాడింది. అయితే, గతంలో కూడా తాను చాలా రకాల సొరచేపలను చూశానని, చాలా మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు.  గత జులైలో కూడా ఫ్లోరిడా బీచ్‌ లో ఓ తండ్రి బిడ్డలను షార్క్‌ బారి నుంచి కాపాడానని చెప్పారు. కానీ ఇలా సర్ఫ ర్‌ని చూసి భయంతో పారిపోయిన షార్క్‌ను చూడటం ఇదే మొదటి సారి అన్నారు మిస్టర్‌ క్రిస్టఫర్‌ జాయిస్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *