Big Breaking: వీడిన వరంగల్ గొర్రెకుంట బావి మిస్టరీ..!

వరంగల్ శివారు ప్రాంతం గీసుకొండలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట బావి మిస్టరీ కేసు వీడింది.  9 మందిని హత్య చేసింది సంజయ్ అని తేలింది.

Big Breaking: వీడిన వరంగల్ గొర్రెకుంట బావి మిస్టరీ..!
Follow us

| Edited By:

Updated on: May 24, 2020 | 10:33 PM

వరంగల్ శివారు ప్రాంతం గీసుకొండలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట బావి మిస్టరీ కేసు వీడింది.  9 మందిని హత్య చేసింది సంజయ్ అని తేలింది. మాక్సుద్ భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం కలిగిన సంజయ్.. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబంతో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో సంజయ్‌కి నలుగురు వ్యక్తులు సహకరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

కాగా గొర్రెకుంట బావిలో ఒకటి, రెండు కాదు ఏకంగా 9 మంది శవాలు బయటకు తేలాయి. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా చంపేశారన్న అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్‌ల ద్వారా పోలీసులకు కొన్ని క్లూలు దొరికాయి. దీంతో అనుమానితులను అదుపులోకి ప్రశ్నించగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. మృతుల్లో ఒకరైన బుస్రా ప్రియుడు సంజయ్ కుమార్ యాదవ్ తన స్నేహితులతో కలిసి సామూహిక హత్యలకు పాల్పడినట్లు తెలిసింది. నిద్ర మాత్రలు ఇచ్చి సృహ కోల్పోయాక ఆ తొమ్మిది మందిని గోనెసంచుల్లో పెట్టి బావిలో పడేసినట్లు తేలింది.

కాగా పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో వీరంతా అద్దె ఇంట్లో ఉండేవారు. ఇక డిసెంబర్ నుంచి వీరు గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌ కుటుంబం ఉంటోంది. భర్తతో విడిపోయిన మక్సూద్ భార్య చెల్లెలు బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్ద ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్న పైభవనంలో బీహార్‌కి చెందిన శ్రీరాం, శ్యాంలు ఉన్నారు. ఇక నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో బుస్రాకు వివాహేతర సంబంధం ఉండగా.. ఈ విషయంలో తరచుగా మక్సూద్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇంటిపై ఉంటున్న శ్రీ రాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ పథకం ప్రకారం ఈ తొమ్మిది మందిని హతమార్చాడు.

Read This Story Also: ఆ బాధ నాకు తెలుసు.. అందుకే వారికి దగ్గరయ్యా..!