సీబీఐ వలలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్
రైల్వే ఉన్నతాధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విధులకు హాజరుకాని ఓ ఉద్యోగి హాజరు సరిదిద్దేందుకు రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా విశాఖ సీబీఐ అధికారులు పట్టుకున్నారు.

రైల్వే ఉన్నతాధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విధులకు హాజరుకాని ఓ ఉద్యోగి హాజరు సరిదిద్దేందుకు రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. జమ్మలమడుగు పరిథిలో పనిచేస్తున్న ఓ ట్రాక్ మెన్ విధులకు సరిగా హాజరు కాలేదు. అతని హాజరు సరిచేయాలంటే లంచం ఇవ్వాలని గుంతకల్లు డివిజన్ ఎస్ఈ విజయ్ రాజు డిమాండ్ చేశాడు. దీంతో ట్రక్ మెన్ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా ఆ ఉద్యోగి రూ.14 వేలు శుక్రవారం ముట్టచెప్పిన సమయంలో విజయ్ రాజును రెడ్‌హ్యాండెడ్‌గా విశాఖ సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.