నాటి చిచ్చర పిడుగులు… సెమీస్‌లో రెండోసారి!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ దాదాపు 11ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ సెమీస్‌లో మరోసారి తలపడుతున్నారు. 2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ సందర్భంగా కోహ్లీ భారత జట్టుకు, విలియమ్సన్‌ న్యూజిలాండ్‌ జట్టుకు నాయకత్వం వహించారు. మలేషియా వేదికగా జరిగిన ఆ టోర్నిలో ఈ జట్లు సెమీఫైనల్స్‌లో పోటీపడింది. దీనిలో కోహ్లీసేన మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌ చేరింది. కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన సెమీస్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని […]

నాటి చిచ్చర పిడుగులు... సెమీస్‌లో రెండోసారి!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 07, 2019 | 5:18 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ దాదాపు 11ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ సెమీస్‌లో మరోసారి తలపడుతున్నారు. 2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ సందర్భంగా కోహ్లీ భారత జట్టుకు, విలియమ్సన్‌ న్యూజిలాండ్‌ జట్టుకు నాయకత్వం వహించారు. మలేషియా వేదికగా జరిగిన ఆ టోర్నిలో ఈ జట్లు సెమీఫైనల్స్‌లో పోటీపడింది. దీనిలో కోహ్లీసేన మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌ చేరింది. కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన సెమీస్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని 205 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం కురిసి డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 43 ఓవర్లకు 191 పరుగుల లక్ష్యాన్ని సవరించారు. టీమిండియా 41.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఐసీసీ ప్రపంచకప్ 2019లో ఇద్దరు సారథులు మరోసారి ప్రపంచకప్‌ సెమీస్‌కి చేరారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న కోహ్లీసేన నాలుగోస్థానంలో ఉన్న విలియమ్సన్‌ జట్టుతో మంగళవారం పోటీపడనుంది. చరిత్ర పునరావృతం అవుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.