Andhra: ఏటీఎంలో డబ్బులు డ్రా చేద్దామంటే సాయంగా వెళ్లాడు.. కట్ చేస్తే.. ఊహించని షాకిచ్చారుగా

Updated on: Sep 18, 2025 | 12:24 PM

ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే సాయం చేద్దామనుకున్నాడు.. కట్ చేస్తే.. వాళ్లు చేసే పనికి షాక్ తగిలింది. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది.? ఈ స్టోరీలో ఓసారి చెక్ చేద్దాం..

గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడుతో దాడి చేశారు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో కిరాణా షాపునకు వచ్చిన దాసరి రామ సంతోష్‌ను.. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటూ పిలుచుకుని వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఏటీఎం దగ్గరకు వెళ్లే సమయంలో రామ సంతోష్‌కు ద్విచక్ర వాహనం తాళాలు ఇవ్వాలని బెదిరించారు. ఇవ్వకపోయేసరికి తమ వెంట తెచ్చుకున్న బ్లేడుతో రామ సంతోష్‌పై దాడి చేసి.. అనంతరం దుండగులు పరారయ్యారు. కాగా, ఈ ఘటన అంతటా సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో సదరు బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేయగా.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.