ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!

|

Nov 24, 2024 | 11:55 AM

మన శరీరానికి అవసరమైన పోషకాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి.. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు, శరీర నిర్మాణానికి చాలా అవసరం.. ఒమేగా 3 రక్తపోటును తగ్గిస్తుంది, రక్తంలో ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది.. రుమటాయిడ్ వ్యాధిలో కీళ్ల వాపును తగ్గిస్తుంది. మెదడు, కళ్ళ పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.

చిత్తవైకల్యం, డిప్రెషన్, ఆస్తమా, మైగ్రేన్, మధుమేహాన్ని నివారించడంలో, తగ్గించడంలో సహాయపడుతుంది.. గుండె సమస్యలను ను నివారించడంలో సహాయపడుతుంది. అయితే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని రకాల చేపలు, విత్తనాలు, గింజలు.. మీకు మరింత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందడానికి సహాయడతాయి.. సాధారణంగా.. సాల్మన్, మాకేరెల్, ట్యూనా, సార్డిన్ వంటి చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ప్రతీ ఒక్కరికీ చేపలను తినడం సాధ్యం కాదు. కాబట్టి శాఖాహారం తినేవారు ఏం చేయాలి? ఈ పోషకాన్ని పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను ఇచ్చే శాఖాహార ఆహారాలు కూడా ఉన్నాయి. సోయాబీన్‌ను ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి తింటారు.. కానీ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెను రక్షించడంలో సహాయపడుతుంది. ఎముకలు కూడా బలపడతాయి. చియా సీడ్స్ కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉత్తమ మొక్కల ఆధారిత వనరులలో ఒకటి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మిమ్మల్ని యంగ్ గా ఉంచే మ్యాజిక్ టీ.. ఈ పూలతో చేసే టీ తాగితే నిత్య యవ్వనం !!

టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా ??

స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!

లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం.. ఏం జరిగిందంటే ??

కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం