కదిలిన ‘స్టార్ ఆఫ్ ది సీస్.. సముద్రంలో తేలుతూ తొలి ప్రయాణం!

Updated on: Sep 04, 2025 | 7:31 PM

ప్రపంచంలోనే అతి పెద్ద విలాసవంతమైన క్రూయిజ్‌ షిప్‌ సముద్రంపై తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. రాయల్‌ కరీబియన్‌ సంస్థకు చెందిన స్టార్‌ ఆఫ్‌ ది సీస్‌ ఆగస్టు 31న ఫ్లోరిడాలోని పోర్ట్‌ కెనావరల్‌ నుంచి తన యాత్రను ప్రారంభించింది. ఇది మెక్సికో, హోండురాస్‌లలో ఏడు రాత్రుల పాటు పర్యటించనుంది. సుమారు 2 లక్షల 50 వేల 800 టన్నుల బరువుతో, 1,196 అడుగుల పొడవుతో ఐకాన్‌ ఆఫ్‌ ది సీస్‌ నౌకతో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద షిప్‌గా రికార్డు సృష్టించింది.

ఇందులో 20 డెక్‌లు ఉన్నాయి. ఈ నౌకలో ఒకేసారి 2,350 మంది సిబ్బంది ఉంటారు. వీరితోపాటు 7 వేలమది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇందులో ప్రయాణికులకు వినోదాన్ని పంచేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. స్విమ్మింగ్‌ ఫూల్స్‌, ఆరు భారీ వాటర్‌స్లైడ్‌లతో కూడిన వాటర్‌పార్క్, ఐస్ రింక్, లేజర్ ట్యాగ్, సర్ఫింగ్ సిమ్యులేటర్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. అంతేకాదు, ప్రయాణికులకు విభిన్న రకాల ఆహారాన్ని అందించేందుకు నలభైకి పైగా రెస్టారెంట్లు, లాంజ్‌లు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నౌకను ఎల్‌ఎన్‌జీ ఇంధనంతో నడిచేలా రూపొందించారు. ఇది సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని వెలువరిస్తుంది. ఓడరేవులో ఉన్నప్పుడు ఉద్గారాలను తగ్గించడానికి షోర్ పవర్ కనెక్షన్లు, వేడిని తిరిగి వినియోగించుకునే వ్యవస్థలు వంటి ఆధునిక సాంకేతికతలను ఇందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా రాయల్ కరీబియన్ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓ జాసన్ లిబర్టీ మాట్లాడుతూ, “స్టార్ ఆఫ్ ది సీస్ ప్రారంభోత్సవం, మా ప్రయాణికులకు అసాధారణమైన అనుభూతులను అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. ఏప్రిల్ 2027 వరకు ఈ నౌక పోర్ట్ కెనావరల్ నుంచే తూర్పు, పశ్చిమ కరేబియన్ ప్రాంతాలకు వారానికోసారి తన సేవలను అందిస్తుందని సంస్థ వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీఆర్ఎస్‌లో కవిత కుంపటి వెనుక రగులుతున్న రాజకీయం

72 ఏళ్ల వయసులో క్లాస్‌రూమ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌

ఈ ఐఏఎస్‌కి.. ఫాలోయింగ్‌ ఎక్కువ గురు.. కారణం

మహిళలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు..

భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్ వ్యోమనౌక? నవంబర్‌లో ఏం జరగబోతుంది?