Artificial Womb Facility: కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. గదిలో గర్భాలను సాగు చేస్తే.. !

|

Dec 23, 2022 | 9:37 AM

కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. మనుషులను కూడా ఫారాల్లో పెంచితే! ఒక గదిలో గర్భాలను సాగు చేస్తే! ఆధునిక టెక్నాలజీలతో ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని ఊహించారా? ఈ ఊహలను నిజం..


కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. మనుషులను కూడా ఫారాల్లో పెంచితే! ఒక గదిలో గర్భాలను సాగు చేస్తే! ఆధునిక టెక్నాలజీలతో ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని ఊహించారా? ఈ ఊహలను నిజం చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రముఖ ఫిల్మ్‌ డైరెక్టర్‌, బయోటెక్నాలజిస్టు హాషెం అల్‌ ఘైలీ దీనికి సంబంధించిన వీడియోను తయారు చేశారు. ఆ వీడియో ప్రకారం.. గర్భాలను ఒక అండాకార పారదర్శక గాజు పెట్టె బర్తింగ్‌ పాడ్‌లో పెంచుతారు. అందుకోసం ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ పద్ధతిని ఉపయోగిస్తారు. వాస్తవంలో తల్లి గర్భంలో ఉండే అన్ని సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేస్తారు. న్యూట్రిషన్లు, ఆక్సిజన్‌ను అందజేస్తారు.దాదాపు 75 ల్యాబ్‌లలో 400 చొప్పున పెట్టెలు ఉంటాయి. ఈ పెట్టెలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సెన్సర్లు కూడా ఉంటాయి. ఆ సెన్సర్ల సాయంతో పెట్టెలోని గర్భం గుండెకొట్టుకొనే వేగం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయులను తెలుసుకోవచ్చు. ఇందులో అమర్చిన కెమెరా సాయంతో గర్భంలోని జన్యుపరమైన సమస్యలు తెలుసుకొని నియంత్రించవచ్చు. ఎప్పటికప్పుడు గర్భం పెరుగుదలను చూడొచ్చు. తల్లిదండ్రులు బిడ్డ పెరుగుదలను చూసేలా యాప్‌ ద్వారా అనుసంధానిస్తారు. వాళ్లు కావాలనుకొంటే పాటలు ప్లే చేయొచ్చు. ఆ బిడ్డకు ముచ్చట్లు చెప్పొచ్చు. బిడ్డను బయటకు తీయాలంటే ఆ బర్తింగ్‌ పాడ్‌పై ఉండే బటన్‌ నొక్కి చేతిలోకి తీసుకోవటమే. ఈ వీడియోను ‘ఎక్టోలైఫ్‌ ఆర్టిఫిషియల్‌ వూంబ్‌ ఫెసిలిటీ’ కోసం హాషెం రూపొందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 23, 2022 09:37 AM