Vivek Ramaswamy: అమెరికాలో అధ్యక్ష రేసులో భారతీయుడి సత్తా..! బరిలో వివేక్ రామస్వామి.

|

Aug 28, 2023 | 8:07 AM

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. భారత సంతతికి చెందిన మరో నేత నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ వంటి దిగ్గజ నేతలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ మారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా మొత్తం ఎనిమిది మంది పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచారు.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. భారత సంతతికి చెందిన మరో నేత నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ వంటి దిగ్గజ నేతలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ మారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా మొత్తం ఎనిమిది మంది పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచారు. ఇటీవల పార్టీ అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చలో వివేక్ తన ప్రత్యేకత చాటుకున్నారు. చర్చ ముగిసిన గంటలోనే ఆయనకు నాలుగున్నర లక్షల డాలర్ల విరాళాలు అంటే దాదాపు 3 కోట్ల 70లక్షల రూపాయలు వచ్చాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గైర్హాజరీలో జరిగిన ఈ చర్చలో వివేక్ ఇతరులకు గట్టిపోటీని ఇచ్చారు.  చర్చ తరువాత జరిగిన సర్వేలో వివేక్ అభ్యర్థిత్వానికి ఏకంగా 28 శాతం మంది మద్దతిచ్చారు. రాన్ డిశాంటిస్‌కు 27 శాతం మంది మద్దతుగా నిలవగా, మైక్‌పెన్స్‌కు 13 శాతం, నిక్కీ హేలీకి 7 శాతం మంది మద్దతు లభించింది. ఇక అమెరికా వార్త సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ వివేక్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. అందరి దృష్టినీ ఆకర్షించడంలో సఫలీకృతమయ్యారని రాసుకొచ్చింది. పార్టీ అభ్యర్థిత్వ రేసులో చివరకు తాను, ట్రంప్ మాత్రమే మిగులుతామంటున్నారు వివేక్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...