అత్యంత అరుదైన చేప (Whalefish) కెమెరా కళ్లకు చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్రం గర్భంలో అత్యంత లోతును ఆరెంజ్ రంగులోని వేల్‌ఫిష్ చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటీవల మోన్‌టెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ చేప కనిపించింది. ఆ సంస్థ ఈ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోన్‌టెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సముద్ర గర్భంలో జలచరాలపై సుదీర్ఘకాలంగా పరిశోధనలు జరుపుతోంది. గత 34 ఏళ్లలో తమ పరిశోధనల్లో 18 సార్లు మాత్రమే ఈ అరుదైన చేప దర్శనమిచ్చినట్లు ఆ సంస్థకు చెందిన పరిశోధకలు తెలిపారు.
రిమోట్ సబ్‌మెరైన్‌ను సముద్ర గర్భంలోకి పంపి పరిశోధనలు జరుపుతున్న సమయంలో ఈ అరుదైన మత్స్యం కెమెరాల్లో రికార్డైనట్లు వెల్లడించారు. సముద్ర గర్భంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో మాత్రమే ఇది అరుదుగా కనిపిస్తాయి. కాలిఫోర్నియా సముద్ర తీరంలో దాదాపు 6600 అడుగుల లోతున సబ్‌మెరైన్‌లోని కెమెరాకు ఈ చేప చిక్కినట్లు తెలిపారు. ఈ అరుదైన చేప(వేల్‌ఫిష్) తన జీవిత కాలంలో రకరకాలుగా తన శరీరాన్ని మార్చుకోగలదు.
Also Read..