నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
"నిన్ను తిరిగి మన దేశానికి తీసుకురావడానికి నేను కొండలనైనా కదిలిస్తాను" అంటూ నటి సెలినా జైట్లీ తన సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీని దుబాయ్ నిర్బంధం నుండి విడిపించడానికి భావోద్వేగ ప్రకటన చేశారు. తొమ్మిది నెలలుగా అబుదాబిలో అదుపులో ఉన్న విక్రాంత్‌కు ‘జాతీయ భద్రత’ పేరుతో చార్జ్‌షీట్ లేకుండా నిర్బంధించారు. ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుని, భారత ప్రభుత్వానికి న్యాయ సహాయం అందించాలని ఆదేశించింది. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని సెలినా విజ్ఞప్తి చేస్తున్నారు.
‘నిన్ను తిరిగి మన దేశానికి తీసుకురావడానికి నేను కొండలనైనా కదిలిస్తాను’ అని తన సోదరుడిని ఉద్దేశించి బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ భావోద్వేగ ప్రకటన చేసారు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ విక్రాంత్ జైట్లీ నటి సెలినా స్వయానా సోదరుడు. భారత సైన్యంలోని పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారిగా దేశానికి సేవలందించారు. అయితే 2024 సెప్టెంబర్‌లో దుబాయ్‌లోని ఒక మాల్‌లో విక్రాంత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకోవడంతో విషాదం మొదలైంది. తొమ్మిది నెలల పాటు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని స్థితిలో కుటుంబం ఉండిపోయింది. ప్రస్తుతం అబుదాబిలోని డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబం షాకైంది. ఆయనపై ‘జాతీయ భద్రత’ అనే అస్పష్టమైన ఆరోపణలు తప్ప, ఇంత వరకు ఎలాంటి చార్జ్‌షీట్ దాఖలు కాలేదు. “ఒక దేశం కోసం తన యవ్వనాన్ని ధారబోసిన సైనికుడికి దక్కాల్సిన గౌరవం ఇదేనా?” అని సెలీనా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం ఒక భారతీయ పౌరుడికి దక్కాల్సిన న్యాయ సహాయాన్ని తక్షణమే అందించాలని కోర్టు స్పష్టం చేసింది.విక్రాంత్ తరఫున వాదించడానికి ఒక ప్రత్యేక న్యాయ సంస్థను నియమించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. గతంలో ఖతార్‌లో మరణశిక్ష పడిన భారత నావికాదళ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే క్షేమంగా తీసుకొచ్చిందో, అదే తరహాలో ప్రధాని మోదీ తన సోదరుడి విషయంలోనూ జోక్యం చేసుకోవాలని సెలీనా కోరుతున్నారు. ఈ కష్టకాలంలో తన ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, తన వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తాయని ఆమె అన్నారు. ఏది ఏమైనా, తన సోదరుడిని భారత్ తీసుకువచ్చే వరకు విశ్రమించబోనని ఆమె ప్రతిన బూనారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌లోని అమెరికన్లకు పిలుపు
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
సమ్మక్క తమ్ముడి జాతర.. అంకన్నగూడెంలో పూనకాలు
హైప్ పెంచుతున్న కొత్త ప్రపంచాలు.. హిట్ కోసం ఏ మాత్రం తగ్గని దర్శకులు
నమ్మించి నట్టేట్లో ముంచేస్తున్న హీరోయిన్స్.. ఎందుకు చేస్తున్నారు ఇలా
