చెదిరిన కల.. అమెరికాలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం వీడియో
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనేది ఎందరో విద్యార్ధుల కల. ఒక్క భారతీయులే కాదు, దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది విద్యార్ధులు అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్లాలనుకుంటారు. అక్కడి యూనివర్శిటీల్లో అడ్మిషన్ కోసం ఎంతో కష్టపడతారు. అలా అడ్మిషన్ సాధించి అమెరికాలో చదువుకోవాలని కలలు గన్న విద్యార్ధుల కలలపై నీళ్లు చల్లారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఇటీవల 19 దేశాలపై ట్రంప్ విధించిన ప్రయాణ నిషేధంతో వారి ఆశలు నిరాశగా మిగిలిపోయాయి. ఏళ్ల తరబడి కష్టపడి అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అడ్మిషన్లు సంపాదించిన విద్యార్ధుల భవిష్యత్తు ఈ ఆంక్షల కారణంగా అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, మయన్మార్ వంటి దేశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల బహారా సఘారీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఇల్లినాయిస్‌లోని ఓ కాలేజీలో అడ్మిషన్ సాధించింది. కానీ, ఊహించని విధంగా అమెరికా ఆంక్షలు అమెకు అడ్డంకిగా మారాయి. తన కల నెరవేరబోతుందని విదేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ క్షణంలో అంతా తలకిందులైపోయింది. తన ఆశలన్నీ అడియాసలైపోయాయని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క బహారానేకాదు, తనలాంటి వేలాది మంది విద్యార్థులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, గతేడాది ప్రయాణ నిషేధం విధించిన దేశాల నుంచి 5,700 మందికి పైగా విద్యార్థులకు వీసాలు జారీ అయ్యాయి. వీరిలో ఇరాన్, మయన్మార్ విద్యార్థులే అధికంగా ఉన్నారు. అయితే, ఈ ఏడాది ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇరాన్‌కు చెందిన ఓ విద్యార్థి తన అడ్మిషన్‌ను వాయిదా వేసుకోగా, మయన్మార్‌కు చెందిన మరో విద్యార్థినికి వీసా ఇంటర్వ్యూ రద్దు కావడంతో చేతికొచ్చిన అడ్మిషన్ దూరమైంది.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
