ముంబై దాడుల నిందితుడి అప్పగింతకు.. అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్ కు అప్పగించకుండా అడ్డుకోవాలంటూ నిందితుడు తహవుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రాణాను దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్థుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది. తహవుర్ రాణాను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. అయితే, రాణా కోర్టును ఆశ్రయించడంతో అప్పగింత వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది.
ఇప్పటికే పలు కోర్టుల్లో వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో చివరి ప్రయత్నంగా రాణా అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాజాగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో రాణాను భారత్ కు అప్పగించడం ఖాయమని అమెరికా న్యాయ నిపుణులు చెబుతున్నారు.2008 నవంబర్ 26న ముంబైలో పాకిస్థానీ టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ దాడులలో పదిమంది అమెరికా పౌరులు కూడా చనిపోయారు. ఈ దాడులకు పాకిస్థానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ కొలమన్ హెడ్లీతో కలిసి తహవుర్ రాణా కుట్ర పన్నారని భారత ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్థాన్ మూలాలు ఉన్న తహవుర్ రాణా (64) కెనడా పౌరుడని, ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అని తెలిపింది. ఓ కేసులో అరెస్ట్ అయి అమెరికా జైలులో ఉన్న రాణాను అప్పగించాలని అగ్రరాజ్యాన్ని కోరింది. ప్రస్తుతం రాణా లాస్ ఏంజెలిస్ జైలులో ఉన్నాడు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాణాను భారత్ కు అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?

