USA లో ఉద్యోగం ఇక కష్టమే! ఉద్యోగుల జీతాలపై అమెరికా కొత్త ప్లాన్

Updated on: May 16, 2026 | 2:51 PM

అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. H-1B వీసా ఉద్యోగుల కనీస వేతనాలను భారీగా పెంచే ప్రతిపాదనలు అమెరికా ప్రభుత్వం తీసుకురావడంతో కంపెనీల నియామక విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు అవకాశాలు తగ్గనున్నాయనే వార్త వినిపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ లేబర్ డిపార్ట్మెంట్ తాజాగా ప్రతిపాదించిన కొత్త నిబంధనలు అలా ఉన్నాయియ. వీటి ప్రకారం, H-1B వీసా కింద నియమించుకునే విదేశీ ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలను భారీగా పెంచాలి. ప్రస్తుతం అమలులో ఉన్న వేతన ప్రమాణాలు దాదాపు 20 ఏళ్ల క్రితం రూపొందించినవి. అవి అమెరికా కార్మికుల వేతనాలను సరైన స్థాయిలో రక్షించడంలో విఫలమయ్యాయని కార్మిక శాఖ తెలిపింది. అందుకే ప్రవేశ స్థాయి నుంచి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న నాలుగు వేతన స్థాయిలను 20 శాతం నుంచి 33 శాతం వరకు పెంచే ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రవేశ స్థాయి H-1B ఉద్యోగులకు కనీస వేతనం సుమారు 97,746 డాలర్లుగా ఉండొచ్చు. అలాగే లెవెల్-2 లెవెల్-3, లెవెల్-4 కు కనీస వేతనాలను పెంచాలని సూచించింది. ఈ వేతనాలు నగరం, ఉద్యోగ రంగాన్ని బట్టి మారవచ్చని అధికారులు తెలిపారు. అమెరికా కార్మికుల కంటే తక్కువ వేతనాలతో విదేశీయులను నియమించుకునే పరిస్థితిని తగ్గించడమే ఈ చర్యల ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రతిపాదనకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఈ పెరిగిన వేతనాలను భరించగలిగినా, చిన్న సంస్థలు ఫ్రెషర్లను లేదా ఎంట్రీ-లెవెల్ ఉద్యోగులను నియమించుకోవడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా ఉద్యోగులకు ఇది రక్షణ కల్పిస్తుందని కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ మే 26 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ట్రంప్‌ పరిపాలనలో కూడా H-1B వేతన నియమాల్లో మార్పులు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ?? ఇండియాలో వేగంగా పెరుగుతున్న DINK కల్చర్‌

భోజనం ముందు రెస్టారెంట్లలో నో ఫోన్.. నో స్క్రోల్‌ నిబంధన

ఆలయంలో వింత ఆచారం.. భక్తులకు ఉచితంగా డబ్బులు పంపిణీ

పోస్ట్ చూడగానే వ్యూస్‌ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు

తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన

Follow Us