అమెరికాలో 43 రోజుల షట్‌డౌన్‌కు ఎండ్ కార్డ్ వీడియో
అమెరికాలో 43 రోజుల సుదీర్ఘ ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడింది. యూఎస్ కాంగ్రెస్ ఆమోదం, ప్రెసిడెంట్ ట్రంప్ సంతకంతో ఇది ముగిసింది. ఈ షట్‌డౌన్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు 55 బిలియన్ డాలర్ల నష్టం కలిగించడంతో పాటు, లక్షలాది మంది ప్రజలు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది.
అమెరికాలో 43 రోజుల సుదీర్ఘ ప్రభుత్వ షట్ డౌన్‌కు ఎట్టకేలకు తెరపడింది. యూఎస్ కాంగ్రెస్ షట్‌డౌన్ ఎత్తివేత బిల్లును 222-209 ఓట్ల తేడాతో ఆమోదించగా, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై సంతకం చేశారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచిన ఈ షట్‌డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ 43 రోజుల షట్ డౌన్ వల్ల అమెరికాకు 55 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. తొమ్మిది లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ప్రభుత్వ సాయంపై ఆధారపడిన నాలుగు కోట్ల మందికి ఆహార సాయం నిలిచిపోయింది. చిన్న వ్యాపారులకు 4.5 బిలియన్ డాలర్ల అప్పులు అందలేదు. దాదాపు 5,500 విమానాలు రద్దు కాగా, అమెరికా స్టాక్ మార్కెట్ కూడా కుదేలైంది. భారత్‌కు హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ కూడా ఆలస్యమైంది.
మరిన్ని వీడియోల కోసం :
