తెలుగు సంప్రదాయానికి పట్టం కడుతూ GWTCS దీపావళి వేడుక వీడియో
వాషింగ్టన్‌లోని గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు రవి అడుసుమిల్లి నేతృత్వంలో 1500 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ప్రముఖ గాయని సునీత, వర్ణం బ్యాండ్ గాన విభావరితో పాటు 300కు పైగా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తెలుగు సంప్రదాయాన్ని చాటారు.
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) ఆధ్వర్యంలో అమెరికా రాజధాని ప్రాంతంలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షుడు రవి అడుసుమల్లి సారథ్యంలో సుమారు 1500 మంది ప్రవాస భారతీయులు ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రముఖ గాయని సునీత, హైదరాబాద్‌లోని వర్ణం బ్యాండ్ బృందం తమ గాన విభావరితో హాజరై ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. యువతతో పాటు చిన్నారులు కూడా ఈ సంగీత కచేరీని ఆస్వాదించారు. 300 మందికి పైగా కళాకారులు కూచిపూడి, డ్యాన్స్ డ్రామాలు, ఫ్యాషన్ షోలు, రామాయణ శబ్దం, దీప శోభ వంటి విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
