US Gold Card Visa: ట్రంప్‌ గోల్డ్‌ కార్డ్‌ పథకం ప్రారంభం

Updated on: Dec 13, 2025 | 1:55 PM

ట్రంప్ ప్రభుత్వం ధనవంతుల కోసం 'గోల్డ్ కార్డ్' పథకాన్ని ప్రారంభించింది, ఇది అమెరికాలో స్థిరపడటానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది. మిలియన్ డాలర్ల పెట్టుబడితో విదేశీ ధనవంతులు, కంపెనీలు, ప్రతిభావంతులైన విద్యార్థులు అమెరికా పౌరసత్వం పొందవచ్చు. ఇది EB-5 వీసా స్థానంలో వచ్చింది, గ్రీన్ కార్డ్ కంటే మెరుగైన ప్రయోజనాలను ఇస్తుంది. దేశ ప్రగతికి నిధులు సేకరించడం దీని లక్ష్యం.

గోల్డ్‌ కార్డ్‌.. పాత్‌టు సెటిల్‌ ఇన్‌ అమెరికా. అంటున్నారు ట్రంప్‌. అమెరికాలో స్థిరపడాలని తహతహలాడే ధనవంతుల కోసం తీసుకొచ్చిన గోల్డ్‌ కార్డు వెబ్‌సైట్‌ను బుధవారం అఫీషియల్‌గా లాంచ్‌ చేశారు. ధనవంతులైతే ఒక మిలియన్‌ డాలర్లు.. కంపెనీలైతే రెండు మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే విదేశాల్లో ఉండే ధనవంతులు కుటుంబంలో ఒక్కొక్కరికి మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కార్పొరేట్‌ కంపెనీలైతే క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్‌ అయ్యే స్టూడెంట్స్‌ కోసం 2 మిలియన్‌ డాలర్లు పెట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. వైట్‌హౌస్‌లో బుధవారం వ్యాపార ప్రముఖుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ-5 వీసా స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని, దేశ ప్రగతికి ఉపయోగిస్తామని ట్రంప్ తెలిపారు. “ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ, దానికంటే చాలా ఉత్తమమైనది, శక్తిమంతమైనది” అని ఆయన తెలిపారు. గ్రీన్‌ కార్డు కన్నా.. ఈ గోల్డ్‌ కార్డుకే ఎక్కువ విలువ, ఉపయోగాలున్నాయని.. ఈ కార్డు ద్వారా సత్వరమే పౌరసత్వం పొందే వీలుందని చెబుతున్నారు ట్రంప్‌. భారత్‌, చైనా, యూరప్‌ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అగ్రరాజ్యంలోనే ఉండొచ్చంటున్నారు. ఒకవైపు కఠినమైన వలస విధానాలు అమలు చేస్తూ, భారీస్థాయిలో బహిష్కరణలు చేపడుతున్న ట్రంప్, మరోవైపు సంపన్న వలసదారుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదివిన ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఇక్కడే అట్టిపెట్టుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ట్రంప్‌ అన్నారు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు 15,000 డాలర్ల ఫీజు వసూలు చేస్తామని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ తెలిపారు. భారత్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు ఈ గోల్డ్ కార్డ్ పొందవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, యూకే, స్పెయిన్, కెనడా వంటి అనేక దేశాల్లో ఇటువంటి ‘గోల్డెన్ వీసా’ పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..

మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!

మా విశ్రాంతి మాటేంటి ?? ప్రశ్నిస్తున్న లోకోపైలట్లు

జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి

ఆ దేశం లో టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌.. ఎందుకో వీడియో తెలుసుకోండి