మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. కాపాడండి ప్లీజ్‌.. నేపాల్ లో భారత మహిళ ఆవేదన

Updated on: Sep 11, 2025 | 6:15 PM

నేపాల్‌లో కొనసాగుతున్న ‘జెన్ జడ్’ నిరసనలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఆందోళనల మధ్య పోఖారాలో చిక్కుకుపోయిన ఓ భారతీయ మహిళ, తనను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తాను బస చేసిన హోటల్‌కు ఆందోళనకారులు నిప్పంటించారని, కర్రలతో తనను వెంబడించారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాలీబాల్ టోర్నమెంట్‌ నిర్వహణ కోసం నేపాల్ వెళ్లిన ఉపాస్తా గిల్ పోఖారాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దయచేసి భారత రాయబార కార్యాలయం ఆదుకోవాలి అంటూ ఆమె వీడియోలో విజ్ఞప్తి చేశారు. తను స్పాలో ఉన్నప్పుడు నిరసనకారులు హోటల్‌కు నిప్పుపెట్టారనీ తెలిపారు. రూమ్‌లోని తన లగేజీ, వస్తువులన్నీ కాలిపోయాయనీ చెప్పారు. పెద్ద పెద్ద కర్రలతో తన వెంటపడ్డారన్నారు. అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాననీ ఆమె తన వీడియో సందేశంలో తెలిపారు. నేపాల్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రోడ్లపై ఎక్కడ చూసినా నిప్పంటుకుని మంటలు చెలరేగుతున్నట్లు ఆమె వివరించారు. పర్యాటకులను కూడా వదలడం లేదనీ.. తామంతా మరో హోటల్‌లో తలదాచుకున్నామనీ దయచేసి తమను కాపాడాలని.. ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, భారత ప్రభుత్వం స్పందించింది. నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితి చక్కబడే వరకు నేపాల్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న భారతీయులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావద్దని హెచ్చరించింది. స్థానిక అధికారుల భద్రతా సూచనలను పాటించాలని కోరింది. కాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయం కోసం రెండు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. నేపాల్‌లో పశుపతినాథ్ ఆలయ సందర్శనకు వెళ్లిన అనేక మంది భారత పర్యాటకులు.. అక్కడ నెలకొన్న అశాంతి కారణంగా తమ పర్యటనలను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోనౌలీ సరిహద్దు వద్ద భారతీయుల రద్దీ పెరిగింది. విమానాలు రద్దు కావడంతో చాలామంది రాత్రంతా లాడ్జీలలో ఉండి, వెనక్కి వస్తున్నామని తెలిపారు. మరోవైపు, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేయగా, శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ నిరసనకారులను కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Robbery: రూ. 4 కోట్ల లగ్జరీ కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ

రోడ్డుపై చెత్త వేస్తున్న వ్యక్తి. మున్సిపల్‌ అధికారులు ఏం చేశారంటే

అట్టుడుకుతున్న నేపాల్‌.. హింసకు అసలు కారణం అదేనా?

Bigg Boss 9: సంజన Vs లక్స్‌ పాప.. షాంపూ బాటిల్ కారణంగా.. రచ్చ రచ్చ లొల్లి!

కూటమి ఐక్యతను చాటిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ