Viral video:15 నిమిషాల తేడాతో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు.. వైరల్ అవుతున్న వీడియో..

|

Jan 21, 2022 | 10:12 PM

ఇద్దరు కవల పిల్లలు కేవలం 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో పుట్టడం ఎప్పుడైనా చూశారా... పోనీ విన్నారా... ఆశ్చర్యంగా ఉంది కదూ.. కవలలేంటి..


ఇద్దరు కవల పిల్లలు కేవలం 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో పుట్టడం ఎప్పుడైనా చూశారా… పోనీ విన్నారా… ఆశ్చర్యంగా ఉంది కదూ.. కవలలేంటి వేర్వేరు తేదీల్లో పుట్టడమేంటని.. కానీ పుట్టారు.. అవును.. వారిద్దరూ కవలల పిల్లలే. 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది ఈ సంఘటన. గ్రీన్‌ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్ పురిటినొప్పులతో డిసెంబరు 31న స్థానిక నటివిడాడ్ మెడికల్ సెంటర్‌లో చేరారు. ఆ రోజు రాత్రి 11.45 గంటల సమయంలో ఆమె బాబుకు జన్మనిచ్చారు. ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే 12 గంటలకు పాపకు జన్మించింది.

Published on: Jan 21, 2022 06:30 PM